విద్యార్థులే దొంగలు..
ABN , Publish Date - Feb 17 , 2026 | 08:32 AM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ల్యాప్‌టాప్‌ల చోరీ కేసులో విద్యార్థులే దొంగలుగా తేలింది. ఓ ఐటీ కంపెనీకి గంపగుత్తగా అమ్మాలని పథకం వేసి తాము చదువుతున్న ఇనిస్టిట్యూట్‌లోని కంప్యూటర్లను చోరీ చేసినట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.
60 ల్యాప్‌టాప్‌లు, 3 సెల్‌ఫోన్లు, 2 కార్లు స్వాధీనం
హెచ్‌సీయూలో ల్యాప్‌టాప్‌ల చోరీ కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ల్యాప్‌టాప్‌ల చోరీ కేసులో విద్యార్థులే దొంగలుగా తేలింది. ఓ ఐటీ కంపెనీకి గంపగుత్తగా అమ్మాలని పథకం వేసి తాము చదువుతున్న ఇనిస్టిట్యూట్‌లోని కంప్యూటర్లను చోరీ చేసినట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. చోరీకి గురైన మొత్తం 60 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసులో నిందితులైన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. శేరిలింగంపల్లి జోన్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్(Serilingampalli Zone DCP CH Srinivas) తెలిపిన వివరాల ప్రకారం..
హెచ్‌సీయూలోని సీఆర్‌రావు ఇనిస్టిట్యూట్‌లో సాయిచరణ్ (19), అశ్విన్‌రావు (19) కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతూ హాస్టల్‌లో నివాసం ఉంటున్నారు. హాస్టల్ నిర్వాహకుడైన ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన రేగుల చంద్రశేఖర్ (30)తో కలిసి ఈ నెల 9న ఇనిస్టిట్యూట్‌లోని కంప్యూటర్ ల్యాబ్‌లో ఉన్న 60 ల్యాప్‌టాప్‌లను చోరీ చేశారు. ఈ ల్యాప్ టాప్‌లను బెంగళూరు(Bangalore)లోని ఓ ఐటీ కంపెనీకి గంపగుత్తగా అమ్మి సొమ్ము చేసుకునేందుకు నెల రోజుల నుంచి పక్కా ప్రణాళికను రూపొందించుకున్నారు.
పథకం ప్రకారమే ల్యాప్‌టాప్‌ల చోరీ..
చోరీకి ముందు విద్యార్థులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. క్యాంప్‌సలో ఎక్కడెక్కడ సెక్యూరిటీ, సీసీ కెమెరాలు ఉంటాయో వారికి అవగాహన ఉండడంతో వాటి నుంచి తప్పించుకునేలా ప్రణాళిక వేసి, హాస్టల్ నిర్వాహకుడితో కలిసి చోరీకి పాల్పడ్డారు. ప్రొఫెసర్ సీఎన్ వర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు ఇనిస్టిట్యూట్‌లో ఉన్న సీసీ కెమెరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. తక్కువ సమయంలోనే కేసును ఛేదించిన గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ బాల్‌రాజ్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ నరేశ్‌లనుడీసీపీ సీహెచ్.శ్రీనివాస్ అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నా వ్యక్తిగత జీవితాన్ని వివాద వస్తువుగా మార్చొద్దు!
ఆ 5 పంచాయతీలను తెలంగాణలో కలపండి
Read Latest Telangana News and National News