Home » Telangana Govt
ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని టీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్నారు.
సమ్మెకు అన్ని సంఘాలూ మద్దతు తెలిపాయని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. ఇప్పటివరకు ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం తమను చర్చలకు పిలవలేదని.. కనీసం సమ్మె నివారణ చర్యలూ చేపట్టలేదని వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తున్న తీరు అభినందనీయం. అయితే, ఆ ప్రోత్సాహం కేవలం నిధుల రూపంలోనే కాకుండా.. క్రీడాకారులు ఆడే మైదానాలను కూడా గౌరవించేలా ఉండాలి.
టాంజానియా ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఐటీ, టూరిజం, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో కలిసి పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
రంగనాయక్ సాగర్ నుంచి పెద్దలింగాపూర్, తంగళ్లపల్లి మండలానికి నీళ్లిచ్చే కాలువ పనులను ఎందుకు పూర్తి చేయడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. న్యాయం చేయాలని అడిగిన రైతులను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు.
శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయిపోయింది. లొంగిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతి ఇస్తోంది.
మహిళా దినోత్సవం జరుపుకుంటేనే బాధ్యత తీరిపోయినట్టు కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలను శక్తితో పోలుస్తామని.. కుటుంబ గౌరవాన్ని కూడా మహిళలతో పోలుస్తామని సీఎం తెలిపారు.
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా అవసరాల దృష్ట్యా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం కల్పించింది. ఉపవాసాలు పాటించే ఉద్యోగుల సౌకర్యార్థం సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.