తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో..
ABN, Publish Date - Apr 30 , 2026 | 07:29 AM
హైదరాబాద్ మెట్రో రైలు చరిత్రలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇప్పటివరకు ఎల్ అండ్ టీ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైలును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
హైదరాబాద్ మెట్రో రైలు చరిత్రలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇప్పటివరకు ఎల్ అండ్ టీ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైలును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. బుధవారం సచివాలయంలో హెచ్‌ఎంఆర్‌ఎల్ చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ అండ్ టీ, ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఎల్ అండ్ టీ, ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ లిమిటెడ్ సంస్థలతో షేర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌కు ఉన్న వంద శాతం షేర్లను రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
ఇవి చదవండి
రష్యాలో మరో ఆయిల్ కేంద్రంపై దాడి.. డ్రోన్ శక్తిని చూపిస్తున్న ఉక్రెయిన్..
పెరిగిన బీరకాయ, పచ్చిమిర్చి.. తగ్గిన వంకాయ, కాకర
Updated at - Apr 30 , 2026 | 07:29 AM