వరి కొనుగోళ్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
ABN , Publish Date - May 12 , 2026 | 04:04 PM
రబీ వరి కొనుగోళ్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వరి అన్‌లోడింగ్ హమాలీ ఛార్జీలు రూ.6.50 నుంచి రూ.8.50కి పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా వరి కొనుగోళ్లకు అంతరాయం లేకుండా కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది.
హైదరాబాద్, మే 12: రబీ వరి కొనుగోళ్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యంతర గోదాములకు క్వింటాల్‌కు రూ.17 హ్యాండ్లింగ్ ఛార్జీలు, వరి అన్‌లోడింగ్ హమాలీ ఛార్జీలు రూ.6.50 నుంచి రూ.8.50కి పెంచింది. కొనుగోలు కేంద్రాల నుంచి గోదాములు, మిల్లులకు వేగంగా ధాన్యం తరలింపునకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా వరి కొనుగోళ్లకు అంతరాయం లేకుండా కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. రబీ 2025-26 సీజన్‌కు ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నాయి.
ఈరోజు(మంగళవారం) జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణరావు హాజరయ్యారు. అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురవుతున్న సమస్యలు, జిల్లాల్లో ఉన్న పరిస్థితులు, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపై జిల్లా కలెక్టర్ల నుంచి సీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం సేకరణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకూడదన్నారు. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు అందేలా చూడాలని సూచించారు. లారీల కొరత ఉంటే ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్
నీట్ పరీక్ష రద్దుపై కేంద్రం బాధ్యత వహించాలి: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Read Latest Telangana News And Telugu News