తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్
ABN , Publish Date - May 12 , 2026 | 01:07 PM
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ బండి భగీరథ్ పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్, మే 12: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ బండి భగీరథ్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో వెకేషన్ బెంచ్‌లో పిటిషన్ వేశారు. పిటిషన్‌పై ఈనెల 14న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు బండి భగీరథ్ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేస్తూ డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు సున్నితమైనది కావడంతో మహిళా ఐపీఎస్ అధికారిణి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించాలని డీజీపీ నిర్ణయించారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడం జరిగింది. సిట్ ఏర్పాటు నేపథ్యంలో మరోసారి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు బండి భగీరథ్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని, నేరం రుజువైతే నిందితుడిని కచ్చితంగా అరెస్ట్ చేస్తామని కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
ఒకే రోజు మూడు చోట్ల చైన్ స్నాచింగ్స్.. భయాందోళనలో ప్రజలు
చంచల్‌గూడ జైలు అధికారుల వినూత్న ప్రయోగం
Read Latest Telangana News And Telugu News