ఇంద్రకీలాద్రిపై వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు
ABN , Publish Date - May 12 , 2026 | 12:29 PM
హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆంజనేయ స్వామికి అభిషేకాలు, నాగవల్లి దళార్చన, ఆకుపూజలు చేశారు.
విజయవాడ, మే 12: ఇంద్రకీలాద్రిపై హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు(మంగళవారం) ఉదయం నుంచే ఆంజనేయ స్వామికి అభిషేకాలు, నాగవల్లి దళార్చన, ఆకుపూజలు నిర్వహించారు. నాలుగు ప్రధాన వేదికలపై హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఘాట్ రోడ్, ప్రధాన ఆలయం, మెట్ల మార్గం, సీతానగరం ఉపాలయాల్లో వేడుకలు నిర్వహించారు.
ఆంజనేయ స్వామికి వేద పండితులు తమలపాకులతో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. హనుమాన్ జయంతి వేడుకలకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. హనుమ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగింది. వేడుకల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఆలయాలను రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు.
ఇవి కూడా చదవండి...
మరికొన్ని రోజుల్లో జీఏడీకి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు అప్పగిస్తాం: మంత్రి నారాయణ
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్.. 24 గంటల్లోనే పూర్తి: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
Read Latest AP News And Telugu News