ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కీలక ముందడుగు

ABN, Publish Date - May 06 , 2026 | 12:19 PM

ప్రాణాహిత నదిపై బ్యారేజీ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. 150 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు.

కొమురంభీం జిల్లా, మే 6: ప్రాణాహిత నదిపై బ్యారేజీ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. అడ్డంకులను అధిగమించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తున్నారు. 150 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతున్నారు. గత పాలకులు విస్మరించిన ప్రాజెక్టును పునరుద్ధరించి ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

Updated at - May 06 , 2026 | 12:28 PM