Home » Telangana Assembly
రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్రం తెచ్చిన ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్న నిరసన తెలిపారు.
ఆరు గ్యారంటీల అమలుతోపాటు విద్య, వైద్య రంగాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి డి.శ్రీధర్‌బాబు తెలిపారు. రెండున్నరేళ్లలో విద్యారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, ప్రభుత్వ పరంగా ప్రీ ప్రైమరీ సెక్షన్లను సైతం ప్రారంభించామని చెప్పారు.
బీసీ కులగణన అంశంపై అసెంబ్లీలో శుక్రవారం కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య జరిగిన ఆసక్తికర చర్చలో సంవాదమిది! కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతున్న రెండో దశ జనగణనకు 40 ప్రశ్నలతో రూపొందించిన ప్రశ్నావళిలో బీసీ/ఓబీసీ అంశాన్ని చేర్చాలనే డిమాండ్‌తో స్వల్పకాలిక చర్చ పెట్టారు.
అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేపై దాడి జరిగిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద బీఆర్‌ఎస్ శ్రేణులు రోడ్లను పసుపునీళ్లతో శుద్ధి చేయటంపై మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితులు నడిచారన్న కారణంతో రోడ్లను శుద్ధిచేసి, బీఆర్‌ఎస్ నేతలు తమ అసలు బుద్ధిని బయటపెట్టుకున్నారని విమర్శించారు.
వర్షాకాల సమావేశాల మొదటిరోజు నుంచే గరంగరంగా నడుస్తున్న శాసనసభ బుధవారం మరింత వేడెక్కింది. తమ మహిళా ఎమ్మెల్యేలపై దాడిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, తమ నాయకుడు కేసీఆర్ చావును కోరుకున్న కాంగ్రెస్ సభ్యుడు వీర్లపల్లి శంకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ సభ్యులు సభను స్తంభింపజేశారు.
సీఎం రేవంత్‌రెడ్డిని ఏకవచనంతో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ధ్వజమెత్తారు. ఏలేటి చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫామ్‌హౌస్‌లో కుట్రకు ప్రణాళికలు రూపొందించారని ఆరోపించారు.
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ అయ్యారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించారు.
కేసీఆర్ ఫాంహౌస్ వద్ద ‘శుద్ధి’ అంశం తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర రచ్చకు దారి తీసింది. బీఆర్‌ఎస్ తీరుపై మంత్రులు మండిపడ్డారు. స్పీకర్‌ను అవమానించడం, నిరసన ప్రాంతాన్ని శుద్ధి చేయడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో మాట్లాడారు.