KA Paul: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై కేఏ పాల్ ఆగ్రహం
ABN , Publish Date - Dec 18 , 2025 | 03:04 PM
బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా పార్టీ ఫిరాయించలేదని స్పీకర్ నిర్ణయించడం షాక్ కి గురిచేసిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఈ నిర్ణయం రాజ్యాంగానికి అవమానమని..
ఢిల్లీ, డిసెంబర్ 18: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తాజా నిర్ణయంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను తోసిపుచ్చిన స్పీకర్, 'ఫిరాయింపు ఆధారాలు లేవు'అనడం విడ్డూరంగా ఉందని పాల్ వ్యాఖ్యానించారు.
పార్టీ ఫిరాయించిన వారిని బిఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగిస్తున్నట్టు స్పీకర్ రూలింగ్ ఇవ్వడం ఆందోళన కలిగించిందని కేఏ పాల్ అన్నారు.'బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్‌లో చేరి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా స్పీకర్ ఫిరాయింపు జరగలేదంటున్నారా? అని పాల్ ప్రశ్నించారు.
'ఇది సిగ్గుచేటు! స్పీకర్‌కు చట్టం తెలుసా? సుప్రీంకోర్టు మీద గౌరవం లేదా?' అని పాల్ ప్రశ్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది తానేనని.. ఈ అంశంపై పోరాటం కొనసాగిస్తానని పాల్ ఢిల్లీలో చెప్పారు.
Also Read:
జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి
ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?
For More Latest News