Home » Tamilnadu News
ముఖ్యమంత్రి విజయ్ సిఫార్సు మేరకు మంత్రులకు శాఖలను కేటాయిస్తూ లోక్ భవన్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రి విజయ్ తన వద్ద హోం, పోలీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ వాటర్ సప్లై శాఖలను ఉంచుకున్నారు.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి ఎపిసోడ్ మరో కీలక మలుపు తిరిగింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఎమ్మెల్యే సేతుపతి ఆశ్రయించారు.
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రికి రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ఇవాళ ప్రభుత్వం విడుదల చేసింది.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు, దేవాలయాలు, బస్‌స్టాండ్స్‌కి 500 మీటర్ల దూరంలో ఉన్న 717 వైన్ షాపులన్నింటినీ క్లోజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఇటీవలి కేంద్ర ఉత్తర్వులను పాటించారు.
తమిళనాడులో ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా టీవీకే అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ కీలక విజ్ఞప్తి చేసింది.
టీవీకే పార్టీ విడుదల చేసిన ఎమ్మెల్యే మన్నార్గుడి కామరాజ్ వీడియోపై అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ అధినేత దినకరన్ స్పందించారు. టీవీకే విడుదల చేసిన వీడియోపై అనుమానాలున్నాయని అన్నారు.
రెండేళ్ల క్రితం ఆవిర్భవించి, తొలి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న టీవీకే పార్టీ.. తాజా ఫలితాల్లో అధికారానికి స్వల్పదూరాన నిలిచిపోయి, 4 రోజుల నుంచి 6 సీట్ల మద్దతు సాధించలేక నానా తంటాలు పడింది.
టీవీకే పార్టీ అధినేత విజయ్‌కి కష్టాలు తప్పటం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ లేకపోవటం వల్ల.. 108 సీట్లు సాధించినా సీఎం పీఠంపై కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే విజయ్ మూడు సార్లు గవర్నర్‌ను కలిశారు. మూడోసారి కూడా విజయ్‌కి నిరాశే ఎదురైంది.
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం కొలువుదీరడానికి అడుగులు పడుతున్నా, మద్దతివ్వడానికి వామపక్షాలు, వీసీకే, కాంగ్రెస్ పెడుతున్న షరతులు విజయ్ తలని బొప్పికట్టించేలా ఉన్నాయి. అటు కాంగ్రెస్, ఇటు వామపక్షాలు, వీసీకే తమ మద్దతుకు సంబంధించి కీలక ప్రకటనలు చేశాయి.