Share News

సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి..

ABN , Publish Date - May 12 , 2026 | 03:28 PM

తమిళనాడు రాష్ట్రానికి చెందిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి ఎపిసోడ్ మరో కీలక మలుపు తిరిగింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఎమ్మెల్యే సేతుపతి ఆశ్రయించారు.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి..
TVK MLA Srinivasa Sethupathi

ఢిల్లీ: తమిళనాడు రాష్ట్రానికి చెందిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి ఎపిసోడ్ మరో కీలక మలుపు తిరిగింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఎమ్మెల్యే సేతుపతి ఆశ్రయించారు. అసెంబ్లీలో టీవీకే పార్టీ బలపరీక్ష ఎదుర్కోవాల్సి ఉండగా.. దానికి దూరంగా ఉండాలంటూ హైకోర్టు ఆంక్షలు విధించింది. దీనిపై ఉన్నత న్యాయస్థానం మెట్లు ఎక్కారు ఎమ్మెల్యే.


ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో శివగంగై జిల్లా తిరుప్పత్తూరు నియోజకవర్గం చర్చనీయాంశమైంది. డీఎంకే అభ్యర్థి పెరియ కరుప్పన్‌పై ఒక్క ఓటు తేడాతో శ్రీనివాస సేతుపతి గెలుపొందారు. సేతుపతికి 83,375 ఓట్లు రాగా.. పెరియ కరుప్పన్‌ 83,374 ఓట్లు సాధించారు. అయితే, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని.. రీకౌంటింగ్ నిర్వహించాలని హైకోర్టులో పెరియ కరుప్పన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం.. తుది తీర్పు వచ్చే వరకు ఎమ్మెల్యే సేతుపతి ఎలాంటి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనకూడదని ఆదేశించింది.


హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఎమ్మెల్యే సేతుపతి ఆశ్రయించారు. ప్రజాప్రతినిధిగా తన హక్కులను కాపాడాలని ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. కాగా, ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వీడియో వైరల్..

ముళ్ల కంచెలకు భయపడం.. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ..

Updated Date - May 12 , 2026 | 03:35 PM