ముళ్ల కంచెలకు భయపడం.. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ..
ABN , Publish Date - May 12 , 2026 | 03:15 PM
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో కంచె నిర్మాణం రెండు దేశాల మధ్య చర్చనీయాంశంగా మారింది. రెండు దేశాల మధ్య కంచె నిర్మాణం కోసం బీఎస్‌ఎఫ్‌కు భూమిని కేటాయిస్తూ పశ్చిమబెంగాల్‌లోని నూతన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో కంచె నిర్మాణం రెండు దేశాల మధ్య చర్చనీయాంశంగా మారింది. రెండు దేశాల మధ్య కంచె నిర్మాణం కోసం బీఎస్‌ఎఫ్‌కు భూమిని కేటాయిస్తూ పశ్చిమబెంగాల్‌లోని నూతన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై తాజాగా బంగ్లాదేశ్ స్పందించింది. ముళ్ల కంచెలకు ఢాకా భయపడదని ఆ దేశ విదేశాంగ శాఖ సలహాదారు ఎం.హెచ్.కబీర్ వ్యాఖ్యానించారు (India Bangladesh border).
పశ్చిమ బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం చేసిన ఎన్నికల వాగ్దానాలను తాము గమనిస్తున్నామని, భారత్ అంతర్గత రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని కబీర్ అన్నారు. అయితే తమ దేశ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని పేర్కొన్నారు. తమ సంబంధాలు నేరుగా భారత కేంద్ర ప్రభుత్వంతోనే ఉంటాయని, రాష్ట్రాలతో తమకు సంబంధం లేదని చెప్పారు (Bangladesh reaction).
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సవాళ్లు ఉన్నప్పటికీ, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు ఇరు దేశాల నాయకత్వం కట్టుబడి ఉందన్నారు (India border fencing). కాగా, అధికారంలోకి వచ్చిన తర్వాత 45 రోజుల్లో బంగ్లాదేశ్ వెంబడి ఉన్న సరిహద్దుల్లో కంచె నిర్మాణం చేపడతామని బీజేపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సీఎం సువేందు అధికారి తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కంచె నిర్మాణం కోసం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు భూమిని కేటాయించారు. ఈ కంచె నిర్మాణం 45 రోజుల్లో పూర్తవుతుందన్నారు.
ఇవి కూడా చదవండి...
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్.. 24 గంటల్లోనే పూర్తి: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
ఇంద్రకీలాద్రిపై వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు