Home » Tamilaga Vettri Kazhagam
తొలి ఎన్నికల్లోనే తమిళనాట తిరుగులేని అదరణతో అతిపెద్ద పార్టీగా నిలిచి అధికారంలోకి వచ్చిన విజయ్ సారథ్యంలోని టీవీకే పొరుగున ఉన్న కేరళంలో రాజకీయ విస్తరణ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కేరళలోని విజయ్ అభిమానులు పలువురు పాలక్కాడ్‌లో ఆదివారంనాడు సమావేశమయ్యారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజాగా చేసిన రాజకీయ వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల విషయంలో తనపై వస్తున్న అనేక ప్రచారాలపై స్పందించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు సీఎం విజయ్‌తో పోల్చి తనను వైసీపీ నేతలు విమర్శలు చేయడంపై పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడులోని అధికార తమిళగ వెట్రి కళగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించవద్దని పార్టీ కార్యకర్తలకు ఆదేశాలిచ్చింది. ప్రజలకు అసౌకర్యం కల్పించడం కానీ, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించడం కానీ చేయవద్దని సూచించింది.
టీవీకే మంత్రివర్గంలో కాంగ్రెస్‌కు పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన ఐదుగురిలో ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు సమాచారం. మంత్రివర్గంలో సెంగోట్టియన్, ఆధవ్ అర్జున, ఆనంద్, అరుణ్ రాజ్, నిర్మల్ కుమార్, రాజ్‌మోహన్‌లకు చోటు కల్పించనున్నారు.
తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం ఈనెల 10న కొలువు తీరనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అనుమతించారు. దీంతో ఆదివారం ఉదయం 10.00 గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో శనివారం సాయంత్రం వరుస ట్విస్ట్‌లు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలంతో గవర్నర్ కార్యాలయానికి బయలు దేరిన టీవీకే చీఫ్ విజయ్‌కు చుక్కెదురైంది. తొలుత గవర్నర్ అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదు. అయితే కొద్ది సేపటికే గవర్నర్ తన పర్యటనను కేన్సిల్ చేసుకుని అపాయింట్‌మెంట్ ఇచ్చారు.
తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ అనుమతి శుక్రవారం పొద్దుపోయిన తర్వాత కూడా రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే దీనికి ముందు గవర్నర్ అనుమతి ఇచ్చేశారనే ప్రచారం కూడా జరిగింది. అయితే గవర్నర్‍కు విజయ్ అందజేసిన లేఖలో 116 మంది ఎమ్మెల్యేలతో కూడిన సంతకాలు మాత్రమే ఉన్నట్టు తెలిసింది.
తమిళనాడులో ఏకైక పెద్ద పార్టీగా నిలిచిన విజయ్ సారథ్యంలోని టీవీకే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగగమైంది. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ శుక్రవారం సాయంత్రం అనుమతించారు.
తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుపై తలెత్తిన ఉత్కంఠకు తెరపడనుంది. తగినంత సంఖ్యాబలంతో గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్‌ను మరోసారి విజయ్ కలవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.