Share News

విజయ్ ప్రమాణస్వీకారంలో ట్విస్ట్.. గవర్నర్‌కు అందని వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు లేఖలు

ABN , Publish Date - May 08 , 2026 | 09:47 PM

తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ అనుమతి శుక్రవారం పొద్దుపోయిన తర్వాత కూడా రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే దీనికి ముందు గవర్నర్ అనుమతి ఇచ్చేశారనే ప్రచారం కూడా జరిగింది. అయితే గవర్నర్‍కు విజయ్ అందజేసిన లేఖలో 116 మంది ఎమ్మెల్యేలతో కూడిన సంతకాలు మాత్రమే ఉన్నట్టు తెలిసింది.

విజయ్ ప్రమాణస్వీకారంలో ట్విస్ట్.. గవర్నర్‌కు అందని వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు లేఖలు
Vijay

చెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు విషయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో గవర్నర్ అనుమతి శుక్రవారం పొద్దుపోయిన తర్వాత కూడా రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే దీనికి ముందు గవర్నర్ అనుమతి ఇచ్చారనే ప్రచారం జరిగింది. అయితే గవర్నర్‍కు విజయ్ అందజేసిన లేఖలో 116 మంది ఎమ్మెల్యేలతో కూడిన సంతకాలు మాత్రమే ఉన్నట్టు తెలిసింది. వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు లేఖలు ఇంకా గవర్నర్‌కు అందలేదని చెబుతున్నారు.


విజయ్ టీవీకే ఏకైక పెద్ద పార్టీగా 108 స్థానాల్లో గెలిచింది. అయితే మెజారిటీకి 118 స్థానాలు అవసరం ఉండటంతో టీఎంకే ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తూ వచ్చింది. విజయ్ రెండు చోట్ల గెలవడంతో ఒక చోటు వదలుకోవలసి ఉంటుంది. ఆ నేపథ్యంలో ఐదు చోట్ల గెలిచిన కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ప్రకటించింది. దీతం టీవీకే బలం 112కు చేరింది. దీంతో గవర్నర్‌ను రెండు సార్లు కలిసిన విజయ్‌కు చుక్కెదురైంది. పూర్తి సంఖ్యాబలంతో రావాలని గవర్నర్ చెప్పడంతో సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అత్యవసరంగా సమావేశమైన సీపీఐ, సీపీఎం పార్టీలు టీవీకేకు బయట నుంచి బేషరతుగా మద్దతు ప్రకటించాయి. దీంతో మరో నాలుగు స్థానాలు టీవీకేకు వచ్చి చేరాయి. ఇద్దరేసి ఎమ్మెల్యేలున్న వీసీకే, ఐయూఎంఎల్ సైతం టీవీకేకు మద్దతు ప్రకటించాయి. దీంతో టీవీకే బలం 120కి చేరినట్టు అయింది. అయితే విజయ్ ఖాళీ చేసే సీటు తమకు ఇవ్వాలని వీసీకే షరతు పెట్టిందని, ఆ పార్టీతో పాటు ఐయూఎంఎల్ నుంచి ఇంకా ఎలాంటి మద్దతు లేఖ గవర్నర్‌కు అందలేదని చెబుతున్నారు. దీంతో మరోసారి విజయ్ ప్రభుత్వానికి అవసరమైన బలం, ప్రమాణస్వీకారంపై సస్పెన్స్ కొనసాగుతోంది. రేపు (శనివారం) ఉదయం 11 గంటలకు నెహ్రూ స్టేడియంలో ప్రమాణస్వీకారానికి టీవీకే సన్నాహాలు చేసుకుంది.


ఇవి కూడా చదవండి...

పుదుచ్చేరి గవర్నర్‌ను కలిసిన రంగస్వామి.. 13న ప్రమాణస్వీకారం

కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్.. 11న ప్రమాణస్వీకారం

Updated Date - May 08 , 2026 | 09:59 PM