గవర్నర్ ట్విస్ట్.. చివరి నిమిషంలో విజయ్‌కు అపాయింట్‌మెంట్
ABN , Publish Date - May 09 , 2026 | 06:36 PM
తమిళనాడు రాజకీయాల్లో శనివారం సాయంత్రం వరుస ట్విస్ట్‌లు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలంతో గవర్నర్ కార్యాలయానికి బయలు దేరిన టీవీకే చీఫ్ విజయ్‌కు చుక్కెదురైంది. తొలుత గవర్నర్ అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదు. అయితే కొద్ది సేపటికే గవర్నర్ తన పర్యటనను కేన్సిల్ చేసుకుని అపాయింట్‌మెంట్ ఇచ్చారు.
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో శనివారం సాయంత్రం వరుస ట్విస్ట్‌లు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలంతో గవర్నర్ కార్యాలయానికి బయలు దేరిన టీవీకే చీఫ్ విజయ్ (Vijay)కు తొలుత చుక్కెదురైంది. గవర్నర్ అందుబాటులో ఉండటం లేదని, కేరళ వెళ్తున్నారని తొలుత లోక్‌భవన్ నుంచి సమాచారం అందడంతో విజయ్ వెనుదిరిగారు. అయితే ఆ కొద్దిసేపటికే గవర్నర్ పర్యటన రద్దు చేసుకున్నట్టు లోక్‌భవన్ కార్యాలయం ఆయనకు సమాచారం ఇచ్చింది. దీంతో సాయంత్రం 6.30 గంటలకు గవర్నర్‌ను విజయ్ కలుసుకోవడం ఖరారైంది. ఈనెల 4వ తేదీన ఫలితాలు వెలువడినప్పటి నుంచి గవర్నర్‌ను విజయ్ కలుసుకోవడం ఇది నాలుగోసారి. పూర్తి సంఖ్యాబలంతో రావాలంటూ గవర్నర్ మూడుసార్లు విజయ్‌ను తిప్పిపంపారు.
చివరివరకూ సస్పెన్స్..
మే 4న తమిళనాడు అసెంబ్లీ ఫలితాల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా నిలచింది. 108 సీట్లు సాధించింది. అయితే మెజారిటీ మార్క్‌కు 10 సీట్లు తగ్గడంతో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అనిశ్చితి తలెత్తింది. విసీకే రెండు చోట్లా గెలవడంతో టీవీకే సంఖ్యాబలం 107కు చేరుకోగా.. ఐదుగురు కాంగ్రెస్ సభ్యులు టీవీకేకు మద్దతు ప్రకటించడంతో అది 112కు చేరంది. ఇద్దరేసి ఎమ్మెల్యేలున్న సీపీఐ, సీపీఎం సైతం బేషరుతుగా మద్దతు ప్రకటించడంతో ఆ సంఖ్య 116కు పెరిగింది. అయితే మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతున్న వీసీకే మద్దతుపై ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. ఎట్టకేలకు టీవీకేకు బేషరతుగా మద్దతిస్తున్నట్టు శనివారం మధ్యాహ్నం వీసీకే ప్రకటించింది. మద్దతు లేఖను అందజేసింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు అవసమైన 118 మంది సభ్యుల మ్యాజిక్ ఫిగర్ టీవీకేకు సమకూరింది.
ఇవి కూడా చదవండి..
విజయ్‌కు లైన్ క్లియర్.. మద్దతు లేఖ అందజేసిన వీసీకే
తమిళనాడులో కృత్రిమ సంక్షోభం: భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి