Share News

విజయ్‌కు లైన్ క్లియర్.. మద్దతు లేఖ అందజేసిన వీసీకే

ABN , Publish Date - May 09 , 2026 | 05:01 PM

విజయ్ టీవీకే ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్క్ సాధించింది. టీవీకేకు బేషరతుగా తమ మద్దతును వీసీకే అధ్యక్షుడు తొల్ తురుమావళవన్ అధికారికంగా ప్రకటించారు. మద్దతు లేఖను స్వయంగా టీవీకేకు అందజేశారు.

విజయ్‌కు లైన్ క్లియర్.. మద్దతు లేఖ అందజేసిన వీసీకే
VCK supports Vijay

చెన్నై: విజయ్ టీవీకే (TVK) ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్క్ సాధించింది. టీవీకేకు బేషరతుగా తమ మద్దతును వీసీకే (VCK) అధ్యక్షుడు తొల్ తురుమావళవన్ (Thol Thirumavalavan) అధికారికంగా ప్రకటించారు. మద్దతు లేఖను స్వయంగా టీవీకేకు అందజేశారు. దీంతో తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం అవసరమైన 118 మంది సభ్యుల సంఖ్యాబలం టీవీకేకు చేకూరింది.


కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో టీవీకే బలం 116కు చేరుకోవడం, మరో ఇద్దరు ఎమ్మెల్యేల బలం అవసరం కావడంతో శుక్రవారం రాత్రి నుంచి ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. దీనికి ముందు పూర్తి సంఖ్యా బలంతో తమ వద్దకు రావాలని గవర్నర్ ఆర్లేకర్ స్పష్టం చేయడంతో మూడుసార్లు గవర్నర్‌ను కలిసిన విజయ్‌కు నిరాశ ఎదురైంది. సంఖ్యాబలం నిరూపించుకోవడానికి ఈనెల 10 తేదీ గడువు కావడంతో ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో వీసీకే మద్దతు అనివార్యమైంది. ఎట్టకేలకు బేషరుతుగా టీవీకేకు మద్దతిస్తున్నట్టు వీసీకే ప్రకటించడంతో విజయ్ పార్టీ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.


గవర్నర్‌ను కలవనున్న విజయ్

వీసీకే మద్దుతుతో మ్యాజిక్ ఫిగర్ సాధించిన విజయ్ నేరుగా గవర్నర్‌ను మరోసారి కలవనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతారు. గవర్నర్ నుంచి ఆహ్వానం అందగానే ఏమాత్రం జాప్యం లేకుండా ప్రమాణస్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

తమిళనాడులో కృత్రిమ సంక్షోభం: భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి

నెట్టింట అన్నాడీఎంకే చీఫ్ పోస్టు.. తమిళనాడులో మరింత పెరిగిన ఉత్కంఠ

Updated Date - May 09 , 2026 | 05:14 PM