Share News

తమిళనాడులో కృత్రిమ సంక్షోభం: భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి

ABN , Publish Date - May 09 , 2026 | 04:20 PM

ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తమిళనాడులో కొనసాగుతున్న ప్రతిష్టంభనను 'కృత్రిమ సంక్షోభం'గా సీనియర్ అడ్వకేట్, భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి అభివర్ణించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా టీవీకే చీఫ్ విజయ్‌ను గవర్నర్ ఆహ్వానించి ఉండాల్సిందని అన్నారు.

తమిళనాడులో కృత్రిమ సంక్షోభం: భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి
Mukul Rogatgi

న్యూఢిల్లీ: ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తమిళనాడులో కొనసాగుతున్న ప్రతిష్టంభనను 'కృత్రిమ సంక్షోభం'గా సీనియర్ అడ్వకేట్, భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి (Mukul Rohatgi) అభివర్ణించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా టీవీకే చీఫ్ విజయ్‌ను గవర్నర్ ఆహ్వానించి ఉండాల్సిందని అన్నారు. తమిళనాడులోని రాజకీయ పరిస్థితిపై ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇది రాజ్యాంగ సంక్షోభం పరిస్థితి కాదని, కృత్రిమ సంక్షోభమని చెప్పారు.


మెజారిటీ మార్క్‌ను టీవీకే సాధించనప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఫలితాలు వెలువడిన మొదటిరోజునే విజయ్‌ను గవర్నర్ కోరాల్సిందని రోహత్గి అభిప్రాయం వ్యక్తం చేశారు. 'మ్యాజిక్ నంబర్‌ను ఆయన సాధించి ఉండకపోవచ్చు. అదేమంత విషయం కాదు. రాజ్యాంగ సంప్రదాయాలకు ప్రకారం అతిపెద్ద పార్టీ నేతను ఆహ్వానించవచ్చు. ఒకటి రెండు వారాల్లో మద్దతు కూడగట్టుకుని స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించ వచ్చు. సభలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం కల్పించవచ్చు. సంఖ్యాబలం తక్కువగా ఉన్నా తగినంత బలం కూడగట్టుకుని ప్రభుత్వం కొనసాగించిన దాఖలాలు గతంలో కూడా ఉన్నాయి' అని రోహద్గి చెప్పారు. విశ్వాస పరీక్ష సమయంలో ఇతర పార్టీలు గైర్హాజరయినప్పుడు మైనారిటీ ప్రభుత్వం మనగడ సాగిస్తుందని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గతంలో చెప్పిన విషయాన్ని కూడా రోహత్గి ప్రస్తావించారు.


'మెజారిటీ మార్క్ 118 కావచ్చు, మరొకటి కావచ్చు. సంఖ్యాబలం చూపించమని పట్టుబట్టడం ద్వారా గవర్నర్ రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తుండటమే ఇప్పుడున్న అసలు సమస్య. ఇది పూర్తిగా తప్పు. బల నిరూపణ అసెంబీల్లోనే కానీ, లోక్‌భవన్‌లో కాదు' అని రోహత్గి స్పష్టం చేశారు.


మళ్లీ ఎన్నికలు సరికాదు..

అతి పెద్ద ఎన్నికల ప్రక్రియ అనంతరం కూడా మళ్లీ ఎన్నికలు జరపడం, రాష్ట్రపతి పాలన విధించడం ఎంతమాత్రం సరికాదని రోహత్గి అన్నారు. ఎన్నికల కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని, ఎంతో సిబ్బంది, ఎన్నో గంటలు వెచ్చించారని చెప్పారు. ఒక వ్యక్తికి 108 లేదా 110 సీట్లు వచ్చాయంటూ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వకపోవడం ఎప్పుడూ జరగలేదని అన్నారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే 108 సీట్లు గెలిచినప్పటికీ మెజారిటీ మార్క్‌కు అవసరమైన 118 సీట్లు సాధించలేకపోయారు. తగినంత మద్దతు కూడగట్టే విషయంలో ప్రస్తుతం అనిశ్చితి కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి..

తమిళనాడు ఎమ్మెల్యేలెవరూ రిసార్ట్‌లో లేరు.. డీకే శివకుమార్

నెట్టింట అన్నాడీఎంకే చీఫ్ పోస్టు.. తమిళనాడులో మరింత పెరిగిన ఉత్కంఠ

Updated Date - May 09 , 2026 | 04:44 PM