Home » Tadipatri
మాజీ ఎమ్మె్ల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టేందుకు హైకోర్టు అనుమతివ్వడంతో.. మరోసారి కేతిరెడ్డి, జేసీ కుటుంబాల మధ్య వివాదం రాజుకుంది. దమ్ముంటే తాడిపత్రికి రా... తేల్చుకుందాం టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి పెద్దారెడ్డికి సవాల్ విసిరారు.
తాడిపత్రిలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఓ వైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీ.. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపడుతుండటంతో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
తమిళనాడులోని నాగపట్టణంలో వెలసిన వెలంకని ఆరోగ్యమాత ఉత్సవాలను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బాంద్రా టెర్మిన్‌స-వెలంకని ప్రత్యేక రైలు (09093) ఈ నెల 27, సెప్టెంబరు ఆరో తేదీల్లో రాత్రి 9-40 గంటలకు బాంద్రా టెర్మిన్‌సలో బయలుదేరి రెండో రోజు ఉదయం 7-40 గంటలకు వెలంకనికి చేరుకుంటుందన్నారు.
Tadipatri Tension: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిపత్రికి వెళ్లి తీరతానంటూ రోడ్డుపైనే కేతిరెడ్డి పెద్దారెడ్డి బైఠాయించారు. పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
పెద్దారెడ్డిని ప్రజలే తాడిపత్రిలోకి రానివ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. పెద్దారెడ్డి పెద్ద కొడుకు ఒక రోగ్ అని, తాడిపత్రిని దోచేసి నాశనం చేశారంటూ మండిపడ్డారు.
తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పెద్దారెడ్డి ఫ్రస్టేషన్‌లో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియకుండా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.
JC Vs Ketireddy: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం ఉండేదన్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాకతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్దారెడ్డి ఇంటిపై దాడికి జేసీ ప్రభాకర్ రెడ్డి బయల్దేరడంతో ఆందోళన నెలకొంది.
JC Prabhakar Reddy: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇద్దరు నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు.. ఇద్దరూ ఏం మాట్లాడారంటే..
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి.. అటు పెద్దారెడ్డి నివాసానికి వారివారి అనుచరులు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.