Share News

AP News: తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్.. అసలేం జరుగుతోంది.. విషయం ఏంటంటే..

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:36 PM

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నాడనే సమాచారంతో పోలీసులు బుధవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నాడని తెలియడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి డీఎస్పీ ఆఫీసు వద్దకు వెళ్లాడని విశ్వసనీయ సమాచారం.

AP News: తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్.. అసలేం జరుగుతోంది.. విషయం ఏంటంటే..

- భారీ పోలీసు బందోబస్తు

తాడిపత్రి(అనంతపురం): మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Kethireddy Peddareddy) తాడిపత్రికి వస్తున్నాడనే సమాచారంతో పోలీసులు బుధవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నాడని తెలియడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి(JC Prabhakar Reddy) డీఎస్పీ ఆఫీసు వద్దకు వెళ్లాడని విశ్వసనీయ సమాచారం. కానీ పెద్దారెడ్డి రాలేదని తెలియడంతో ప్రభాకర్‌ రెడ్డి కూడా అక్కడకు వెళ్లకుండా విరమించుకోవడంతో పోలీ సులు ఊపిరిపీల్చుకున్నారు.


pandu3.jpg

కానీ ఏ క్షణంలో ఏం జరుగుతుం దోనన్న ఆలోచనతో సబ్‌డివిజన్‌ నుంచి పెద్దఎత్తున పోలీసు బలగాలను రప్పించారు. సబ్‌డివిజన్‌తోపాటు పుట్లూరు, యల్ల నూరు మండలాల నుంచి సీఐలు, ఎస్‌ఐలు హుటాహుటినా డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికే మూడురోజుల క్రితం కాకర్ల రంగనాథ మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు తలమునకలైన పోలీసులు మరోపక్క పెద్దారెడ్డి రాకతో పోలీసుల్లో నిద్రపట్టలేదు.


తిమ్మంపల్లికి చేరుకున్న పెద్దారెడ్డి అనుచరులు

యల్లనూరు: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Kethireddy Peddareddy) స్వగ్రామమైన తిమ్మంపల్లికి బుధవారం తెల్లవారుజామున ఆయన అనుచరులు చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లడానికి బుధవారం ఉదయాన్నే రావాలని తన అనుచరులకు సమాచారం అందించారు. అయితే మంగళవారం రాత్రి పోలీసులు జరిపిన చర్చలతో తాడిపత్రికి వెళ్లే కార్యక్రమం వాయిదా వేసుకున్నారు. అయినా బుధవారం ఉదయాన్నే పుట్లూరు, యల్లనూరు మండలాలకు చెందిన ఆయన అనుచరులు తిమ్మంపల్లికి చేరుకున్నారు. దీంతో ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో బందోబస్తు నిర్వహించారు.

pandu3.2.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

రికార్డు స్థాయికి బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నిన్ను.. నీ కుటుంబాన్ని చంపేస్తాం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 04 , 2025 | 12:36 PM