JC Prabhakar Reddy: ఆ ప్రమాదం కలిచివేసింది.. మేం 1934 నుంచి బస్సులను నడుపుతున్నాం
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:33 PM
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం కలచివేసిందని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. టౌన్ బ్యాంక్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బస్సుల నిర్మాణంలో లోపంవల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కొందరు మాట్లాడడం బాధాకరమని అన్నారు.
- మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి(అనంతపురం): కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం కలచివేసిందని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి(JC Prabhakar Reddy) అన్నారు. టౌన్ బ్యాంక్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బస్సుల నిర్మాణంలో లోపంవల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కొందరు మాట్లాడడం బాధాకరమని అన్నారు. తాము 1934 నుంచి బస్సులను నడుపుతున్నామని, దివాకర్ ట్రావెల్స్‌కు పేరు రావడంతోనే తాము ఈ స్థాయిలో ఉండగలిగామని అన్నారు.

తమకు బస్సులంటే అమితమైన ప్రేమ అని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కాపాడుకుంటామని అన్నారు. గతంలో ఆలిండియా పర్మిట్ విధానం ఉండేదని, దాన్ని రద్దు చేయడంతో బస్సులపై అవగాహన లేనివారు కూడా ట్రావెల్స్‌ను నడుపుతున్నారన్నారు. సింగిల్ విధానం అమలు చేస్తే ట్రావెల్స్ తగ్గుముఖం పడతాయని అన్నారు. గతంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వారే ఎక్కువగా నడిపేవారని,

ప్రస్తుతం ట్యాక్స్‌లు పెరగడంతో నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్(Nagaland, Arunachal Pradesh) నుంచే బస్సులు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. సౌత్ ఇండియాలో బస్సుల నాణ్యత బాగుంటుందని, నార్త్ ఇండియాలో ప్రామాణికత సరిగా ఉండదని అన్నారు. గతంలో దివాకర్ ట్రావెల్స్ బస్సులు జబ్బార్ ట్రావెల్స్ వారికి లీజుకు ఇచ్చామని, అప్పట్లో దగ్ధమైన బస్సు తమ పేరిట ఉన్నందున చనిపోయినవారి కుటుంబాలకు పరిహారం చెల్లించామని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. బంగారం ధర మరికొంచెం తగ్గింది..
Read Latest Telangana News and National News