Home » Supreme Court
విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ కస్టడీ మృతి వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాయికృష్ణ తల్లికి లేని ఆసక్తి మీకెందుకు? అని అత్యున్నత న్యాయస్థానం ఆయన్ను నిలదీసింది.
దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ జారీ చేసిన తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ నేతలు స్వాగతిస్తున్నారు.
దానం నాగేందర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. దానం నాగేందర్ తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సుప్రీం ధర్మాసనం సీరియస్‌గా తీసుకుంది.
విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసి జైలుకు పంపినట్టు వివరించారు.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 కొత్త చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో భిన్న తీర్పు వెలువడింది.
జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై నమోదైన కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీ సర్ ప్రక్రియలో భాగంగా లాజికల్ డిస్క్రిపెన్సీస్ కేటగిరీ కింద ఓటర్లకు జారీ చేస్తున్న నోటీసులపై సుప్రీం కోర్టు ఈసీపై పలు ప్రశ్నలు సంధించింది.
కావేరి జలాల వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. కర్ణాటకకు 70 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రైవేట్ సొసైటీల పిటిషన్లు చెల్లవన్న సుప్రీంకోర్టు.. అంతర్రాష్ట్ర నీటి వివాదాల్లో మూడో వ్యక్తులు లేదా సొసైటీలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది.
దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ హైకోర్టు తనపై విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.