మేనకాగాంధీ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమే.. కానీ.. సుప్రీం కోర్టు తీవ్ర అసహనం
ABN , Publish Date - Jan 20 , 2026 | 06:28 PM
వీధి శునకాల అంశానికి సంబంధించి తాము ఇచ్చిన తీర్పుపై కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ చేసిన విమర్శలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆమె కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ మండిపడింది..
న్యూఢిల్లీ: వీధి శునకాల అంశానికి సంబంధించి తాము ఇచ్చిన తీర్పుపై కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ (Maneka Gandhi) చేసిన విమర్శలను సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా పరిగణించింది. ఆమె కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ మండిపడింది. అయినప్పటికీ న్యాయస్థానం ఔన్నత్యం దృష్ట్యా ఆమెపై చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది. వీధి శునకాల అంశంపై న్యాయమూర్తులు విక్రమ్‌నాథ్, సందీప్ మెహతా, ఎన్‌వీ అంజారియాలో కూడిన సుప్రీం ధర్మాసనం మరోసారి మంగళవారం విచారణ జరిపింది.
'కోర్టు ఆచితూచీ వ్యవహరించాలని మీరు చెబుతారు. అయితే మీ క్లయింట్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఆమెను అడిగారా? ఆమె ఎలాంటి ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరిపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ సమయంలో ఆమె తీరు గమమనించారా?' అని మేనకాగాంధీ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ రాజు రామచంద్రన్‌ను సుప్రీం బెంచ్ ప్రశ్నించింది. మేనకాగాంధీ మాజీ మంత్రిగా ఉన్నప్పుడు వీధి కుక్కల సమన్యను నివారించేందుకు ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు జరిపారని జస్టిస్ మెహతా ప్రశ్నించారు. శునకాలకు ఆహారం పెట్టేవారని జవాబుదారీ చేయాలని కోర్టు అంత తేలిగ్గా వ్యాఖ్యానించలేదని, సమస్య తీవ్రతను బట్టే వ్యాఖ్యానించిందని అన్నారు.
కుక్కకాటు ఘటనల్లో రాష్ట్ర ప్రభుత్వాలు భారీ పరిహారం చెల్లించాలని, అలాంటి కేసుల్లో శునకాలకు ఆహారం పెట్టేవారిని జవాబుదారీ చేయాలని జనవరి 13న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి.
టెకీ మృతి ఘటన.. నొయిడా సొసైటీ బిల్డర్ అరెస్టు
నితిన్ నబీన్‌కు జడ్ కేటగిరీ సెక్యూరిటీ
Read Latest National News