Share News

టీమిండియా అని పిలవకూడదంటూ పిటిషన్.. సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే..

ABN , Publish Date - Jan 22 , 2026 | 04:41 PM

బీసీసీఐ నేతృత్వంలో ఏర్పడిన క్రికెట్ జట్టును టీమిండియాగా అభివర్ణించకూడదని, ఈ మేరకు ప్రసార భారతికి ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాది రీపక్ కన్సల్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

టీమిండియా అని పిలవకూడదంటూ పిటిషన్.. సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే..
Team India controversy

బీసీసీఐ నేతృత్వంలో ఏర్పడిన క్రికెట్ జట్టును 'టీమిండియా'గా అభివర్ణించకూడదని, ఈ మేరకు ప్రసార భారతికి ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాది రీపక్ కన్సల్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లతో కోర్టులపై భారం మోపొద్దని సూచించింది (SC ruling on Team India).


బీసీసీఐ అనేది ప్రైవేట్ సంస్థ అని, దాని నేతృత్వంలోని క్రికెట్ జట్టును 'భారత జాతీయ జట్టు' అని, 'టీమిండియా' అని పిలవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని పిటిషనర్ పేర్కొన్నారు. ఇలా పిలవడానికి కేంద్రం నుంచి కూడా అనుమతులు లేవని వాదించారు. ఈ పిటిషన్‌ను తాజాగా విచారించిన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీసీఐ నేతృత్వంలోని క్రికెట్ జట్టును టీమిండియా అనే పేరుతో పిలిస్తే వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించింది (Supreme Court plea dismissed).


'మీరు ఇంట్లో కూర్చుని ఇలాంటి పిటిషన్లను తయారు చేస్తున్నారు. ఈ పేరుతో మీకు వచ్చిన సమస్య ఏంటి? దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ జట్టు అన్ని చోట్లా క్రికెట్ ఆడుతోంది. ఇలాంటి పిటిషన్ దాఖలు చేసి మీ సమయంతో పాటు కోర్టు సమయాన్ని కూడా వృథా చేస్తున్నారు' అని సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.


ఇవి కూడా చదవండి..

అవును.. మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి.. షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు..


మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో జిరాఫీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 22 , 2026 | 04:41 PM