Home » Sunday
వానాకాలం ఇళ్లకే పరిమితం కాకుండా... వర్షంలో తడుస్తూ కొండలు, కోనలు... పచ్చని చెట్లను చూస్తూ... ప్రకృతిని ఆస్వాదించేవారు చాలామందే ఉంటారు. వర్షాల్లో పర్యాటకం కచ్చితంగా సరికొత్త అనుభూతినిస్తుంది. అయితే ఈ కాలంలో సాఫీగా ప్రయాణం చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. నిపుణులు ఏం చెబుతున్నారంటే...
ప్రపంచమంతా ‘కె’ చుట్టూ పరిభ్రమిస్తోంది. కె సిరీస్, కె సినిమా, కె మ్యూజిక్, కె రుచులు, కె ఫ్యాషన్లు... ఇంకా కె బ్యూటీ. ‘కె’ అంటే కొరియన్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన యువతరం ‘కొరియన్’ ఫ్యాషన్లనే కాదు... బ్యూటీ ట్రెండ్స్‌నూ గట్టిగా ఫాలో అవుతోంది.
బామ్మ ఉంటే... పిల్లలకు తోడుగా ఉండేది. బామ్మ ఉంటే... ఇద్దరికీ సర్దిచెప్పి గొడవ పెద్దది కాకుండా చూసేది. ఇలాంటప్పుడు బామ్మ ఉంటే బాగుండేది... ఇలా అనుకునే సందర్భాలు అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా బామ్మ లేని వాళ్లు ఏదో ఒక సమయంలో ఇలా కచ్చితంగా ఫీలవుతారు.
ఆ ఊరిలోకి అడుగుపెడితే... నిర్మాణాలన్నీ ఖాళీ సీసాలతోనే కనిపిస్తాయి. సాధారణంగా ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలి. కానీ ఒక్క ఇటుక కూడా వాడకుండా, ఖాళీ సీసాలతో ఇళ్ల నిర్మా ణాలు చేశారక్కడ. ఇంతకీ ఆ ‘బాటిల్ విలేజ్’ ఎక్కడుందంటే...
ఫ్రెండ్... ఒకే ఒక్క మాట మనసుకు ఎంతో సాంత్వనను ఇస్తుంది. కష్టాల్లో, బాధల్లో, ఒంటరితనంలో, సమూహంలో... మన అస్తిత్వానికి ఒక ప్రతిరూపం. సరైన ఫ్రెండ్ ఒక్కరున్నా చాలు... సంతోషాలకు చిరునామా దొరికినట్టే. నేడు (ఆగస్టు 3) ‘స్నేహితుల దినోత్సవం’. ఈ సందర్భంగా కొందరు తారలు తమ ప్రియ మిత్రుల గురించి, వారితో పెనవేసుకున్న మధుర స్మృతుల గురించి ఇలా పంచుకున్నారు ...
ఆ రాశి వారికి ఈ వారం ధనలాభం ఫుల్‌గా ఉంటుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. మనోధైర్యంతో ముందుకు సాగుతారని, చెల్లింపులు వాయిదా వేసుకుంటారని తెలుపుతున్నారు. అంతేగాక వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారని, గృహాలంకరణ పట్ల ఆసక్తి కలుగుతుందని తెలుపుతున్నారు. ఇంకా ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఇంట్లో పిల్లి... వీధిలో పులి... అనే మాట అప్పుడప్పుడు వినిపిస్తుంది. నిజానికి చూడటానికి రెండూ ఒకేలా ఉన్నా ఆకారాన్ని బట్టి గుర్తుపట్టొచ్చు. కొద్దిగా రంగులో తేడా ఉన్నా మనకు తెలిసిన పిల్లి ఒకేలా ఉంటుంది. అయితే పులుల్లాంటి పిల్లులు కూడా ఉంటాయంటే నమ్ముతారా? ప్రపంచవ్యాప్తంగా అరుదైన రకాలు చాలానే ఉన్నాయి.
విమానయానం గురించి సోషల్‌మీడియాలో చెబుతూ పాపులర్ అయిన సామ్ చూయి... విమానంలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసే ఫియోనాను ప్రేమించాడు. వాళ్లిద్దరూ తమ పెళ్లి విమానంలోనే జరగాలనుకున్నారు.
నగరాల్లో ట్రాఫిక్ కష్టాల గురించి తెలిసిందే. గంటల కొద్దీ నిలిచిపోయే ట్రాఫిక్‌తో నిత్యం నరకమే. ముఖ్యంగా కారులో వెళ్లే వారి బాధ చెప్పనక్కర్లేదు. ముందుకూ, వెనక్కి వెళ్లలేని పరిస్థితి. అందుకే ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించు కునేందుకు కారును బైక్‌లా మార్చేశాడు ఒక ఔత్సాహిక మెకానిక్. కారులాంటి బైకులో కూర్చుని, రయ్యిన దూసుకెళ్తున్నాడు.
ఒక చిన్న కథ చెప్పనా సరదాగా ... ఇవాళ, నిజంగా జరిగిందే! కబుర్ల కోసం చెపుతాను. పొద్దున్నే, వంటింట్లోని అల్మారాలో కందిపప్పు కోసం, డబ్బాలో పోద్దామని, వెదుకుతూ వుంటే, ఆర్నెల్ల కిందట కొన్న ఒక గారెల పౌడరు ప్యాకెట్ దొరికింది.