వాటినే ‘ఇండికేటర్స్ ఆఫ్ జాయ్’ అంటారు..
ABN , Publish Date - Sep 14 , 2025 | 08:03 AM
మనిషి సంతోషంగా ఉండడానికి కొన్ని కొలమానాలుంటాయి. వాటిని ‘ఇండికేటర్స్ ఆఫ్ జాయ్’ అంటారు. అలాంటి 82 కొలమానాలతో లండన్‌కు చెందిన ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్’ అనే సంస్థ ‘హ్యాపీ సిటీ ఇండెక్స్’ను ఇటీవల విడుదల చేసింది. అంటే ప్రపంచంలోని ఆనంద నగరాలను గుర్తించింది.
- ఆనంద నగరాలు
మనిషి సంతోషంగా ఉండడానికి కొన్ని కొలమానాలుంటాయి. వాటిని ‘ఇండికేటర్స్ ఆఫ్ జాయ్’ అంటారు. అలాంటి 82 కొలమానాలతో లండన్‌కు చెందిన ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్’ అనే సంస్థ ‘హ్యాపీ సిటీ ఇండెక్స్’ను ఇటీవల విడుదల చేసింది. అంటే ప్రపంచంలోని ఆనంద నగరాలను గుర్తించింది. ఈ పోటీలో 200 నగరాలు పాల్గొన్నాయి. వాటిలో ఈ ఏడాది తొలి ఆరు స్థానాలు సాధించిన నగరాలపై విహంగ వీక్షణం...
ప్రశాంతంగా... పరిశుభ్రంగా...
బెల్జియం ఆర్థిక, సాంస్కృతిక గుండె చప్పుడుగా ‘యాంత్‌వర్ప్’ను చెప్పాలి. హ్యాపీ సిటీ ఇండెక్స్‌లో అయిదవ స్థానాన్ని సాధించింది. చరిత్ర, వాణిజ్యం, సృజనాత్మకతల మేలుకలయిక ఈ నగరం. ఇక్కడ ప్రతీ వెయ్యి మందికి ఆరుగురు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. సగటు ఆయుర్దాయం 81.2 ఏళ్లు. 99 శాతం జనాభాకు మెడికల్ ఇన్సూరెన్సు ఉంటుంది. ప్రభుత్వం సోషల్ హౌజింగ్‌లోనూ స్థానికులకు సహాయపడుతుంది. నగరమంతా పచ్చదనం పరుచుకుని ఉంటుంది. శనివారం మార్కెట్ ఈ నగర ప్రత్యేక ఆకర్షణ. ఏ సమయంలోనైనా హాయిగొలిపే ప్రశాంతత ఈ నగరాన్ని అందరికీ ఫేవరెట్‌గా మారుస్తుంది.
సంతోషానికి చిరునామా
చారిత్రక కట్టడాలు, ఆధునిక నిర్మాణాలు, ప్రపంచ స్థాయి రెస్టారెంట్లు... ఇవన్నీ డెన్మార్క్ రాజధాని ‘కోపెన్‌హాగెన్’ను విభిన్న నగరంగా తీర్చిదిద్దాయి. ప్రపంచంలో అత్యంత సంతోషమయమైన నగరాల్లో మొదటి స్థానం దీనిదే. ఆరోగ్యం, సంక్షేమానికి ఇక్కడ పెద్ద పీట వేస్తారు. ఈ నగరవాసుల సగటు ఆయుర్దాయం 79.9 ఏళ్లు. ఇక్కడ ప్రతీ వెయ్యి మందికి 5 మంది డాక్టర్లు ఉన్నారు. వారానికి సగటున 37 పని గంటలుంటాయి. ప్రత్యామ్నాయ రవాణాకు ఈ నగరం ప్రసిద్ధి చెందింది. అత్యధికులు సైకిళ్లు వినియోగిస్తారు. బైక్ లైన్ ప్రత్యేకంగా ఉంటుంది. వాటర్ బస్‌లలో ప్రయాణం బాగుంటుంది. ఏడాది పొడవునా లైట్ ఫెస్టివల్, కుకింగ్, స్ట్రీట్ పార్టీలతో ఎంతో కోలాహలంగా ఉంటుంది వాతావరణం. ఉత్తర యూరప్‌లో అతి పెద్ద స్ట్రీట్ ఫుడ్ మార్కెట్ ఇక్కడే ఉంది. లైబ్రరీలు, మ్యూజియాలు సరికొత్త కార్యక్రమాలతో అందర్నీ ఆకర్షిస్తుంటాయి. చాలామటుకు వీటిలో ప్రవేశం ఉచితమే. ఈ నగర మరో ప్రత్యేకత ‘ద హ్యూమన్ లైబ్రరీ’. వలంటీర్లే ఆయా పుస్తకాలుగా కావాల్సిన విజ్ఞానాన్ని సందర్శకులకు పంచుతారు.
ఈ ఏడాది కూడా...

స్విట్జర్లాండ్‌లో అతి పెద్ద నగరం జ్యూరిచ్. ఆ దేశ సాంస్కృతిక, సాంఘిక, ఆర్థిక కేంద్రం కూడా ఈ నగరమే. సమీపంలోనే ఆల్ప్స్ పర్వతాలు ఉండడం వల్ల టూరిస్టుల సందడి ఎక్కువ. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కచ్చితత్వానికి మరో పేరు. జ్యూరిచ్ అత్యంత పరిశుభ్రమైన నగరం. అంతేకాదు ఇక్కడ అంతా ఓ పద్ధతి ప్రకారం జరుగుతుంటుంది. స్పష్టమైన నిబంధనలు, నియంత్రణలను పౌరులు తూ.చా.తప్పకుండా పాటిస్తారు. నేరాలు తక్కువ. స్థిరమైన ఆర్థిక వ్యవస్థ వీరి సొంతం. అందుకే జ్యూరిచ్ ఆనంద నగరాల జాబితాలో రెండో స్థానంలో ఉంది. గతేడాది కూడా ఇదే స్థానంలో ఉండడం విశేషం. వీధులు, పబ్లిక్ రవాణా వ్యవస్థలు చాలా శుభ్రంగా ఉంటాయి. ఈ నగరంలో వెయ్యికి పైగా స్వచ్ఛమైన నీటి ఫౌంటెయిన్‌లున్నాయి. ఇవి నగర శోభను ఇనుమడింపచేస్తాయి. 50కి పైగా మ్యూజియాలున్నాయి. పబ్లిక్ బాత్‌హౌజ్‌లు స్విస్ జీవనంలో సర్వసాధారణం. మహిళలకు ప్రత్యేకమైన బాత్‌హౌజ్‌లుంటాయి.
ఆసియాలో మొదటిది

రోటీ... కప్‌డా... మకాన్... ఉంటే చాలు దేశ ప్రజలకు వేరే అవసరాలు ఏముంటాయి? కానీ ప్రాథమిక అవసరాలతో పాటు సుస్థిర ఆర్థిక వ్యవస్థ, చక్కటి హెల్త్‌కేర్, పబ్లిక్ సర్వీసెస్, పచ్చదనం, వాతావరణ సమతుల్యం ఉంటే... ఇలాంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది సింగపూర్. ‘హ్యాపీ సిటీ ఇండెక్స్’లో ఈ నగరం మూడో స్థానాన్ని, ఆసియాలో మొదటి స్థానాన్ని నమోదు చేసుకుంది. ఇక్కడ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే కార్యాచరణను రూపొందిస్తుంది. చాలా ఖర్చుతో కూడుకున్న జీవనవిధానం. అందుకే పబ్లిక్ హౌజింగ్ స్కీమ్ ద్వారా పౌరుల సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేసింది. ఆధునిక మౌలిక సదుపాయాలు, మంచి హెల్త్‌కేర్, స్థిర ఆర్థిక రంగం ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచుతున్నాయి. ప్రపంచ స్థాయి తోటలు, రెస్టారెంట్లు, మ్యూజియాలు, పబ్లిక్ రవాణా వ్యవస్థ, అద్దంలా మెరిసే రోడ్లు, పరిశుభ్రత ప్రజలకు ఆనందకర జీవితాన్ని అందిస్తాయనడంలో సందేహం లేదు.
అంతటా చిరునవ్వులే...

‘హ్యాపీ సిటీ ఇండెక్స్’లో ఈ ఏడాది ఆశ్చర్యకరంగా తొలి 30 నగరాల్లో మూడు డెన్మార్క్‌కి చెందినవే కావడం విశేషం. డెన్మార్క్‌లోని ‘ఆర్హస్’ నగరం ‘హ్యాపీ సిటీ ఇండెక్స్’లో నాలుగో స్థానంలో నిలిచింది. నవ్వుల నగరంగా పేరుతెచ్చుకున్న ఆర్హస్ దేశంలో రెండో అతిపెద్ద నగరం. పాదచారులు, సైకిల్ మీద వెళ్లే వారికి అనువుగా రోడ్లను తీర్చిదిద్దారు. పబ్లిక్ రవాణా బాగుంటుంది. స్టూడెంట్ కమ్యూనిటీ ఎక్కువ . అందుకే ప్రతి చోటా బబ్లింగ్ వాతావరణం ఆహ్వానిస్తుంది. ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేబట్టిన వేస్ట్ టూ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ కార్యక్రమాలు నగరానికి మంచి పేరు తెచ్చాయి. హార్బర్ సమీపంలో పార్కులు ఆహ్లాదాన్ని పెంచుతున్నాయి. వారానికి 37 గంటల పని వేళల వల్ల ప్రజలు వర్క్- లైఫ్‌ని సరిగా బ్యాలెన్స్ చేస్తూ, జీవితాన్ని ఆహ్లాదకరంగా మలచుకున్నారు.
ప్రశాంతంగా... పరిశుభ్రంగా...

బెల్జియం ఆర్థిక, సాంస్కృతిక గుండె చప్పుడుగా ‘యాంత్‌వర్ప్’ను చెప్పాలి. హ్యాపీ సిటీ ఇండెక్స్‌లో అయిదవ స్థానాన్ని సాధించింది. చరిత్ర, వాణిజ్యం, సృజనాత్మకతల మేలుకలయిక ఈ నగరం. ఇక్కడ ప్రతీ వెయ్యి మందికి ఆరుగురు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. సగటు ఆయుర్దాయం 81.2 ఏళ్లు. 99 శాతం జనాభాకు మెడికల్ ఇన్సూరెన్సు ఉంటుంది. ప్రభుత్వం సోషల్ హౌజింగ్‌లోనూ స్థానికులకు సహాయపడుతుంది. నగరమంతా పచ్చదనం పరుచుకుని ఉంటుంది. శనివారం మార్కెట్ ఈ నగర ప్రత్యేక ఆకర్షణ. ఏ సమయంలోనైనా హాయిగొలిపే ప్రశాంతత ఈ నగరాన్ని అందరికీ ఫేవరెట్‌గా మారుస్తుంది.
సాంకేతిక దిగ్గజం

దక్షిణకొరియా రాజధాని ‘సియోల్’ హ్యాపీ సిటీ ఇండెక్స్‌లో ఆరో స్థానంలో ఉంది. కొరియా అనగానే చూడచక్కని సంస్కృతి, సృజనాత్మకత, సాంకేతికత గుర్తుకొస్తుంది. ఎలకా్ట్రనిక్ పేమెంట్లు, అర్బన్ ప్లానింగ్, మౌలిక రంగాల్లో ఈ నగరం ముందుంది. ప్రపంచస్థాయి యూనివర్సిటీలు యాభైకి పైగా ఇక్కడ ఉన్నాయి. ప్రతి వెయ్యి మందికి 2.5 డాక్టర్లు ఉన్నారు. సగటు ఆయుర్దాయం 85 ఏళ్లు. బహిరంగ ప్రదేశాల్లో హింస చాలా తక్కువ. సియోల్ నగర అర్బన్ విధానాల్లో ఆరోగ్యం, సంరక్షణకు పెద్దపీట వేస్తారు. అడ్వాన్స్ ఈ గవర్నెన్స్ వల్ల ప్రజలు లాభపడుతున్నారు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కువ. ఆ విధంగా నగరవాసులకు కంఫర్ట్‌ను, సంతోషాన్ని అందించడంలో ముందుంది.