Home » Sunday
దూరం నుంచి చూస్తే బోట్లన్నీ తిరగబడి కనిపిస్తుంటాయి. ఆ ఊరంతా అలా తిరగబడిన బోట్లే కనిపిస్తాయి. ఈక్విహెన్ ప్లేజ్ గ్రామస్తులు వెరైటీగా పడవలను తిరగేసి ఇల్లుగా మార్చుకుంటారు. ఆ గ్రామంలో ఏ ఇంటిని చూసినా తిరగబడిన పడవే పైకప్పుగా కనిపిస్తుంది.
హ్యుమనాయిడ్ రోబోలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. విద్యారంగం, ఆతిథ్యం, వస్తురవాణా వంటి రంగాల్లో హ్యూమనాయిడ్ రోబోల వినియోగం పెరిగింది. చాలా సంస్థలు ఇప్పటికే రోబోలను ప్రవేశపెట్టాయి.
ఆ రాశి వారు ఈ వారం తలపెట్టిన కార్యం సఫలమవుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. కార్యసాధనకు మరింత కష్టపడాలని, పరిస్థితులు కొంతమేరకు మెరుగుపడతాయని సూచిస్తున్నారు.
పద్దెనిమిది ఏళ్ల వయసప్పుడు... కంప్యూటర్స్ అంటే మక్కువ ఉన్న ఓ సాధారణ సైన్స్ విద్యార్థి దీపక్ రవీంద్రన్. అప్పుడే తొలి స్టార్టప్ వెంచర్ ‘ఇన్నోజ్ టెక్నాలజీస్’ను ప్రారంభించాలని ఇంజనీరింగ్ చదువును మధ్యలో మానేశాడు. అతడితో పాటు మరో ముగ్గురు స్నేహితులు కలిశారు.
కీర్తనలు, భజనలు దేవాలయాల్లో ఉంటాయి. నైట్ క్లబ్బుల్లో డిమ్‌లైట్లు, డిస్కో ట్రాక్‌లు, గ్లాసుల గలగలలుంటాయి. ‘జెన్ జెడ్’ ఈ రెండింటిని మిక్స్ చేస్తోంది. ఒత్తిడిని, ఆందోళనను అధిగమించేందుకు భజనలను అలవాటు చేసుకుంటున్న కుర్రతరం... వాటిని గుళ్లలో కాకుండా, నైట్ క్లబ్‌లలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఆస్వాదిస్తున్నారు. ‘భజన్ క్లబ్బింగ్’ అంటున్న ఈ సరికొత్త ట్రెండ్ నగరాల్లో నడుస్తోంది.
ఈ సరస్సుల్లో నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఎంత స్వచ్ఛంగా అంటే... సరస్సుల్లోని 30 అడుగుల లోతులో ఉన్న రాళ్లను కూడా స్పష్టంగా చూడొచ్చు. అక్కడ ఉండే తక్కువ ఉష్ణోగ్రతలు సరస్సులో నాచు పెరగడాన్ని నిరోధిస్తాయి.
కొత్త పుస్తకం ఆవిష్కరించడానికి ఒక వేదిక కావాలి. ప్రముఖ రచయితలు, పబ్లిషర్లను కలుసుకునేందుకు మార్గం కావాలి. సాహిత్య ప్రియులు కోరుకునేది ఇదే. ఇలాంటి వారికోసం ‘బుక్ ఎక్స్‌పో అమెరికా’ స్వాగతం పలుకుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా పుస్తక ప్రదర్శనలను ఏటా ఒకే చోట నిర్వహిస్తుంటారు.
నాకు చిన్నప్పటి నుంచి సంగీతమంటే ప్రాణం. ఆ మక్కువతోనే తరచూ రేడియోల్లో పాటలు వినేదాన్ని. టీవీలో సంగీత కార్యక్రమాల్ని ఆసక్తిగా చూసేదాన్ని. ఎక్కడ సంగీత ప్రదర్శనలు జరిగినా వెళ్లేదాన్ని... అన్నారు ప్రముఖ నటి గిరిజా ఓక్. విభిన్న శైలిలో పాటలు ఎలా పాడాలో చూసి నేర్చుకున్నానని, మరాఠీలోని ‘సింగింగ్ స్టార్’లో పాల్గొని ఫైనలిస్ట్‌గా నిలిచాపపి ఆమె అన్నారు.
వివాహ వేడుకలో ఎక్కువ సేపు నిలబడడం, నడవడం, డ్యాన్సు స్టెప్పులు వేయడం వల్ల అలసటకు గురైన అతిథులు, కుటుంబ సభ్యులకు ఉపశమనం కలిగించడానికి ‘ఫుట్ స్పా’ను అందిస్తున్నారు.
తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు చేదూ ఆరు రుచులూ కలగసిన షడ్రసోపేత వంటకం కచోరీ. ఉత్తరాదిలో కచోరీ ప్రసిద్ధి. సూరదాసు ‘పూరీ సపూరీ కచౌరౌ కౌరీబ సదళ సు ఉజ్వల సుందర శౌరీ’ అంటూ పొంగిన పూరీలు ... పొరలు పొరలుగా బంగారు రంగులో మెరిసే గుండ్రని కచ్చౌరీల ఉజ్వల సుందర శోభను వర్ణిస్తాడు.