Share News

Temple: ఆ ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శిస్తే... జుట్టు వస్తుందట.!

ABN , Publish Date - Jan 18 , 2026 | 01:26 PM

జుట్టు ఊడిపోతున్న వారి కోస జపాన్‌లో ఓ ప్రత్యేక గుడి ఉంది. జుట్టు ఒత్తుగా, దృఢంగా ఉండాలనుకునేవారు, బట్టతల సమస్యతో బాధపడేవారు.. అక్కడి క్యోటో నగరంలో ఉన్న ‘మికామి’ పుణ్యక్షేత్రానికి వెళ్తుంటారు.

Temple: ఆ ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శిస్తే... జుట్టు వస్తుందట.!

- జుట్టును ప్రసాదించమని వేడుకుంటూ...

బట్టతల చూసుకుని తరచూ బాధపడేవారు తారసపడుతూనే ఉంటారు. కొందరేమో బోడి గుండుపై జుట్టు మొలిచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే.. జుట్టును ప్రసాదించమని వేడుకుంటూ, గుడి మెట్లు ఎక్కేవారున్నారంటే ఆశ్చర్యమేస్తుంది. అలాంటివారి కోసమే జపాన్‌లో ఒక గుడి కూడా ఉంది. అక్కడి క్యోటో నగరంలో ఉన్న ‘మికామి’ పుణ్యక్షేత్రానికి.. జుట్టు ఒత్తుగా, దృఢంగా ఉండాలనుకునేవారు, బట్టతల సమస్యతో బాధపడేవారు వెళ్తుంటారు. ఆ ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శిస్తే.. జుట్టు వస్తుందని అక్కడి ప్రజల విశ్వాసం.


ఆ గుడిలో ప్రార్థనా విధానం విచిత్రంగా ఉంటుంది. భక్తులు ఆలయ ప్రాంగణంలోకి వెళ్లేటప్పుడు ప్రత్యేక ప్రార్థనా కవర్‌ను కొనుక్కుని వెళ్తారు. ఆలయ పూజారులు భక్తుల జుట్టును కొంత కత్తిరించి ఆ కవర్‌లో వేస్తారు. దాన్ని మసాయుకి ఫుజివారా దేవుడి వద్ద పెట్టి ప్రార్థించి తిరిగి పూజారికి అప్పగిస్తారు. ఇలా చేయడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు ఉండవని, జుట్టు దృఢంగా మారుతుందని నమ్ముతారు. ఈ విశ్వాసంతోనే ఏటా వేలాదిమంది భక్తులు ఆ ఆలయాన్ని సందర్శిస్తుంటారట.


book8.2.jpg

ఆలయ నిర్మాణం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. ‘ఫుజివారా ఉనెమెనోసుకే మసాయుకి’ అనే క్షురకుడు (జపాన్‌ తొలి హెయిర్‌ డ్రెస్సర్‌) తన వృత్తిని దైవంగా భావించి పనిచేసేవాడట. ఆయన గౌరవార్థం, ఆయన్నే దైవంగా భావించి ఆలయాన్ని నిర్మించారు. ఆయన వర్ధంతి నాడు జపాన్‌ అంతటా క్షురకులు, సెలూన్‌ నిర్వాహకులు ఘనంగా నివాళులర్పిస్తారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.

ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి, వెండి ధరల్లో కొనసాగుతున్న పెరుగుదల! నేటి రేట్స్ ఇవీ..

శబరిమల బంగారం చోరీ కేసు.. సిట్‌కు చేరిన శాస్త్రీయ నివేదిక

Read Latest Telangana News and National News

Updated Date - Jan 18 , 2026 | 01:51 PM