Home » Student
బడికి వెళదామంటే కుక్కల భయం, దీంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించకుండా ఇంటికే పరిమితం చేస్తున్నారు. అడ్డగుట్టలోని ప్రభుత్వ స్కూలు ఎదురుగా గుంపులు గుంపులుగా ఉన్న కుక్కలు రోడ్లపైనే కాపు కాస్తున్నాయి. బడికి వచ్చే విద్యార్థులను కరుస్తుండడంతో భయానక పరిస్థితి ఏర్పడింది.
మహీంద్రా యూనివర్సిటీలో తాము క్రమశిక్షణ, నిజాయితీ, చట్టానికి గౌరవం వంటి అత్యున్నత ప్రమాణాలను పాటిస్తామని ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.యాజులు మేడూరి స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన నార్కోటిక్స్ కేసులో తమ యూనివర్సిటీ విద్యార్థుల ప్రమేయం ఉందని వెలువడిన పరిణామాలపై తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్‌లోని మహీంద్ర విశ్వవిద్యాలయంలో మత్తుమందుల రాకెట్‌ను సైబరాబాద్ ఈగల్ పోలీసు బృందాలు బట్టబయలు చేశాయి.
జమాత్ పై నిషేధం తర్వాత దాదాపు 300 పాఠశాలలు దర్యాప్తు పరిధిలోకి వచ్చాయని మంత్రి సకినా ఇటూ తెలిపారు. నిఘా సంస్థల దర్యాప్తు ఆధారంగా, 50 పాఠశాలలకు క్లీన్ చిట్ ఇవ్వబడిందని పేర్కొన్నారు. అయితే, 215 పాఠశాలల నిర్వహణ కమిటీలపై ప్రతికూల నివేదికలు వచ్చాయని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారదర్శకంగా డీఎస్సీ నియామకాలు చేపడుతోందని డీఎస్సీ-2025 కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించడమే ప్రభుత్వ దృఢ సంకల్పమని వ్యాఖ్యానించారు. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల నిర్దారణకు ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో సవరణలను చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాలల్లో బోధనా ప్రమాణాలు, నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అన్న అంశాలను పరిగణలోకి తీసుకుని మాత్రమే ఫీజులు పెంచేందుకు అనుమతి ఇచ్చింది.
వినుకొండలోని బీసీ బాలుర హాస్టల్ నరసరావుపేట రోడ్డులోని శ్రీనివాస్ నగర్ ఓ అద్దె భవనంలో కొనసాగుతుంది. ఈ హాస్టల్లో ఇంటర్మీడియట్, ఐటీఐ కళాశాల విద్యార్థులు 40 మందికి పైగా ఉంటున్నారు. అయితే ఈ అద్దె భవనంలో వసతులు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 మందికి పైగా విద్యార్థులు విష జ్వరాలతో ఇబ్బంది పడుతుంటే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించకుండా రేవంత్ ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తోందని మండిపడ్డారు. విద్యార్థులను గురుకులంలోనే ఉంచి అరకొర వైద్యం అందించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? అని హరీష్‌రావు ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ)లో ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఇక్కడ సీటు రాదని తేలిపోయిన విద్యార్థులు వైద్యవిద్య కోసం విదేశాలకు వరుస కడుతున్నారు.
ఎల్బీనగర్‌లో గ్యాంగ్ వార్ రాజుకుంది. ఒకరిపై ఒకరు దాడి విద్యార్థులు చేసుకున్నారు. శుక్రవారం రోజు ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొట్టుకున్న వాళ్లంతా అవినాష్ కాలేజీ విద్యార్థులుగా తెలుస్తోంది.