Share News

మాక్‌ అసెంబ్లీకి పెద్దకడబూరు విద్యార్థి

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:34 AM

వచ్చే నెల 26న జరిగే మాక్‌ అసెంబ్లీకి మంత్రాలయం నియోజకవర్గం తరపున పెద్దకడబూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపికయ్యాడు.

మాక్‌ అసెంబ్లీకి పెద్దకడబూరు విద్యార్థి
వీరేంద్రను అభినందిస్తున్న ఎంఈవో,హెచ్‌ఎం, ఉపాధ్యాయులు

మంత్రాలయం/పెద్దకడబూరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 26న జరిగే మాక్‌ అసెంబ్లీకి మంత్రాలయం నియోజకవర్గం తరపున పెద్దకడబూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపికయ్యాడు. మంత్రాలయం జడ్పీ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహించారు. పెద్దకడబూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి వీరేంద్ర వ్యాసరచన, క్విజ్‌, వక్తృత్వ పోటీల్లో విజేతగా నిలిచినట్లు ఎంఈవో రాగన్న, హెచ్‌ఎంలు గోట్ల చంద్రశేఖర్‌, జోజరాజు, లచ్చప్ప, న్యాయనిర్ణేతలు మద్దిలేటి, జీవానందపాలు తెలిపారు. గురువారం మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి, పెద్దకడబూరు, మంత్రాలయం, కౌతాళం మండలాల నుంచి ముగ్గురు విద్యార్థుల చొప్పున 12 మంది విద్యార్థులతో నిర్వహించిన పోటీల్లో వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్‌ పోటీల్లో వీరేంద్ర విజేతగా నిలిచినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంఈవో, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు వీరేంద్రను అభినందించారు. నల్లారెడ్డి, బసవరాజు, నాగరాజు, రాగవేణి, రామచంద్రగౌడు, సువర్ణజోషి ఉన్నారు.

Updated Date - Oct 31 , 2025 | 12:34 AM