గేటు వద్దే ఆపేశారు..!
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:19 AM
ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయానికి దీపావళి సెలవులు రావడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు.
ఎమ్మిగనూరు రూరల్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయానికి దీపావళి సెలవులు రావడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. సెలవుల అనంతరం 22వ తేదీన విద్యార్థులు విద్యాలయానికి రావాల్సి ఉంది. అయితే కొందరు విద్యార్థులు శుక్రవారం ఉదయం విద్యాలయానికి రావడంతో వారిని లోపలికి అనుమతించలేదు. ఉదయం వచ్చామని, మధ్యాహ్నం వరకు ఎండలో గేటు ముందు నిల్చోబెట్టడమేగాక కనీసం తాగేందుకు నీరు కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.