Hyderabad: చదువుకోమని తల్లి మందలించినందుకు..
ABN , Publish Date - Oct 14 , 2025 | 08:32 AM
చదువుకోకుండా ఇంటి వద్దనే ఉన్న కుమార్తెను చదువుకోమని తల్లి మందలించినందుకు ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అంబర్‌పేట పీఎస్ పరిధిలో జరిగింది.
- బాలిక ఆత్మహత్య
హైదరాబాద్: చదువుకోకుండా ఇంటి వద్దనే ఉన్న కుమార్తెను చదువుకోమని తల్లి మందలించినందుకు ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అంబర్‌పేట(Amberpet) పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన రమేష్, జ్యోతి ఏడు నెలలుగా అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె వైష్ణవి(17), ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువు మానేసి ఇంట్లోనే ఉంటుంది. దీంతో ఈనెల 12న ఉదయం జ్యోతి తన కుమార్తె వైష్ణవిని చదువుకోమని కాలేజీకి వెళ్లమని మందలించింది.

దీంతో తాను చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. తలుపులు కొట్టగా తెరవలేదు. ఇంటి పక్క వారిని పిలిపించి తలుపులు పగలగొట్టి చూడగా ఇంట్లోని ఫ్యాన్‌కు వైష్ణవి చీరతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే 108ను పిలిపించి చూడగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వారు తెలిపారు. జ్యోతి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ తరుణ్‌కుమర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
దేవుడా.. చుక్కలనంటుతున్న పసిడి ధరలు
వెంకటేష్ నాయుడి ఫోన్ అన్‌లాక్‌కు అనుమతి
Read Latest Telangana News and National News