Home » Stock Market
విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు దిగుతుండడంతో దేశీయ సూచీలు వరుసగా నాలుగో రోజు కూడా నేల చూపులు చూస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు హెచ్1బీ వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయం, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడడం నెగిటివ్‌గా మారాయి.
అమెరికా అధ్యక్షుడు హెచ్1బీ వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయం ఐటీ రంగ షేర్లను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. అలాగే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడడం, ఇండియన్ ఈక్వెటీ మార్కెట్లు ఓవర్ వెయిట్ జోన్‌లో ఉన్నట్టు హెచ్‌ఎస్‌బీసీ ప్రకటించడంతో మదుపర్లలో ఆందోళన కలిగిస్తోంది.
సోమవారం భారీ నష్టాలను చవిచూసిన సూచీలు మంగళవారం కూడా అదే ధోరణిలో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ ఐటీ రంగంలో అమ్మకాలు సూచీలు వెనక్కి లాగుతున్నాయి.
హెచ్1బీ వీసాల ఫీజును అమాంతంగా పెంచేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఐటీ సెక్టార్‌పై తీవ్ర ప్రభావం చూపనుందనే అంచనాలతో దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఐటీ రంగంలో అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ మార్కెట్లు రోజంతా నష్టాల్లోనే కదలాడాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (సెప్టెంబర్ 22న) స్పల్ప నష్టాలతో మొదలయ్యాయి. ఈ క్రమంలో బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ50 సూచీలు దిగువకు పయనిస్తుండగా, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు మాత్రం లాభాల్లో ఉన్నాయి.
అమెరికా షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ క్లియర్ చేసిన తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా పెరిగాయి.
హిండెన్‌బర్గ్ ఆరోపణలతో దేశవిదేశాల్లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ కంపెనీలకు సెబీ క్లీన్‌చిట్ ఇచ్చింది. అదానీ గ్రూప్ అకౌంటింగ్ మోసాలు, స్టాక్ అవకతవకలకు పాల్పడుతోందని అమెరికా షార్ట్ సెల్లర్ కంపెనీ చేసిన ఆరోపణలు నిజం కావని సెబీ తేల్చి చెప్పింది.
ఊహించినట్టుగానే యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించడం దేశీయ సూచీలకు బూస్టింగ్ ఇచ్చింది. అలాగే భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయనే వార్తలు మదుపర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.
భారత స్టాక్ మార్కెట్ సెప్టెంబర్ 18న కూడా లాభాల జోరును కొనసాగించింది. ఇది వరుసగా మూడో రోజు కావడం విశేషం. అమెరికా ఫెడ్ రిజర్వ్ తాజా నిర్ణయం ఈ జోరుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
మంగళవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం కూడా అదే జోరును కొనసాగించాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయనే వార్తలు మదుపర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.