Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఏవంటే..
ABN , Publish Date - Dec 23 , 2025 | 03:47 PM
గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగతూ వస్తున్న ఐటీ రంగంలో లాభాల స్వీకరణ జరిగింది. హెవీ వెయిట్ ఐటీ కంపెనీల్లో లాభాల స్వీకరణ సూచీలను వెనక్కి లాగింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్‌గా రోజును ముగించాయి.
సోమవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. రోజంతా లాభనష్టాలతో దోబూచులాడి చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. గరిష్టాల వద్ద మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. అలాగే గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగతూ వస్తున్న ఐటీ రంగంలో లాభాల స్వీకరణ జరిగింది. హెవీ వెయిట్ ఐటీ కంపెనీల్లో లాభాల స్వీకరణ సూచీలను వెనక్కి లాగింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్‌గా రోజును ముగించాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (85, 567)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం150 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా అప్రమత్తంగా కదలాడింది. మంగళవారం సెన్సెక్స్ 85, 342 - 85, 704 శ్రేణి మధ్యలో కదలాడింది. చివరకు సెన్సెక్స్ 42 పాయింట్ల స్వల్ప నష్టంతో 85, 524 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 4 పాయింట్ల లాభంతో 26, 177 వద్ద స్థిరపడింది. 26 వేల మార్క్‌ను నిలబెట్టుకుంది (stock market news today).
సెన్సెక్స్‌లో చోలా ఇన్వెస్ట్, ఐఆర్‌ఎఫ్‌సీ, టిటాగర్, ఎన్‌ఎమ్‌డీసీ, కోల్ ఇండియా మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). కోఫోర్జ్, సయింట్, ఫెడరల్ బ్యాంక్, హిటాచీ ఎనర్జీ, మాజగాన్ డాక్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 4 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ నిన్నటి క్లోజింగ్ దగ్గరే ఈ రోజు కూడా ముగిసింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.65గా ఉంది.
ఇవీ చదవండి:
జోస్ అలుక్కాస్ ప్రచారకర్తగా దుల్కర్ సల్మాన్
ఈ ఏడాది ఐటీ నియామకాల్లో 16 శాతం వృద్ధి