Share News

Stock Market: స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు.. 600 పాయింట్లు ఆర్జించిన సెన్సెక్స్..

ABN , Publish Date - Dec 22 , 2025 | 03:59 PM

2026లో అమెరికా ఫెడ్ రిజర్వ్ రెండు సార్లు వడ్డీ రేట్లను తగ్గిస్తుందని వెలువడుతున్న అంచనాలు మదుపర్లలో పాజిటివ్ సెంటిమెంట్‌ను పెంచాయి. అలాగే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలపడుతుండడం, ఐటీ రంగ షేర్లపై ఆసక్తి, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు సూచీలను ముందుకు నడిపించాయి.

Stock Market: స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు.. 600 పాయింట్లు ఆర్జించిన సెన్సెక్స్..
Stock Market

గత వారం భారీగా నష్టపోయిన దేశీయ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. విదేశీ మదుపర్లు గత సెషన్‌లో ఏకంగా 1800 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అలాగే 2026లో అమెరికా ఫెడ్ రిజర్వ్ రెండు సార్లు వడ్డీ రేట్లను తగ్గిస్తుందని వెలువడుతున్న అంచనాలు మదుపర్లలో పాజిటివ్ సెంటిమెంట్‌ను పెంచాయి. అలాగే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలపడుతుండడం, ఐటీ రంగ షేర్లపై ఆసక్తి, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి. (Indian stock market).


గత సెషన్ ముగింపు (84, 929)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం150 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు జరగడంతో లాభాలు మరింత చివరకు సెన్సెక్స్ 638 పాయింట్ల లాభంతో 85, 567 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 206 పాయింట్ల లాభంతో 26, 172 వద్ద స్థిరపడింది. మళ్లీ 26 వేల మార్క్‌ను దాటింది (stock market news today).


సెన్సెక్స్‌లో సోలార్ ఇండస్ట్రీస్, మాజగాన్ డాక్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, నాల్కో, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). డిక్సన్ టెక్నాలజీస్, చోలా ఇన్వెస్ట్, సమ్మన్ క్యాపిటల్, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్, హీరో మోటోకార్ప్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 234 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 505 పాయింట్లు ఆర్జించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.65గా ఉంది.


ఇవి కూడా చదవండి..

ఆర్ఎస్ఎస్‌ను బీజేపీ కోణంలో చూడటం తప్పు: మోహన్ భాగవత్

మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 22 , 2025 | 03:59 PM