Stock Market: సూచీలకు భారీ నష్టాలు.. 500 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
ABN , Publish Date - Dec 16 , 2025 | 04:08 PM
సోమవారం విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.1, 468 కోట్లు విలువైన షేర్లు అమ్మేశారు. విదేశీ సంస్థాగత మదుపర్లు గత పన్నెండు రోజులుగా విక్రయాలు జరుపుతున్నారు. ఇది కూడా నెగిటివ్‌గా మారింది. అలాగే అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్లను వెనక్కి లాగాయి.
దేశీయ సూచీలు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (91 రూపాయలు) రికార్డు కనిష్టానికి చేరడం తీవ్ర ప్రభావం చూపించింది. అలాగే సోమవారం విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.1, 468 కోట్లు విలువైన షేర్లు అమ్మేశారు. విదేశీ సంస్థాగత మదుపర్లు గత పన్నెండు రోజులుగా విక్రయాలు జరుపుతున్నారు. ఇది కూడా నెగిటివ్‌గా మారింది. అలాగే అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్లను వెనక్కి లాగాయి. దీంతో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (85, 213)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే ట్రేడ్ అయింది. చివరి గంటలో ఆ నష్టాలు మరింత పెరిగాయి. చివరకు సెన్సెక్స్ 533 పాయింట్ల నష్టంతో 84, 679 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 167 పాయింట్ల నష్టంతో 25, 860 వద్ద స్థిరపడింది. మళ్లీ 26 వేల దిగువకు వచ్చింది (stock market news today).
సెన్సెక్స్‌లో సుప్రీమ్ ఇండస్ట్రీస్, వేదాంత, ఆస్ట్రాల్ లిమిటెడ్, టైటాన్ కంపెనీ, భారతీ ఎయిర్‌టెల్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). పీబీ ఫిన్‌టెక్, యాక్సిస్ బ్యాంక్, ఎటర్నల్, భారత్ డైనమిక్స్, ఎన్‌బీసీసీ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 427 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 502 పాయింట్లు నష్టపోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 91.03గా ఉంది.
ఇవీ చదవండి:
అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!
జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..