Home » Stock Market
వచ్చే వారం భారత స్టాక్ మార్కెట్ (Stock Market Outlook) ఎలా ఉంటుందోనని అనేక మంది ఇన్వెస్టర్లు ఆసక్తితో ఉన్నారు. లాభాల వైపు వెళ్తుందా, లేదంటే మళ్లీ నష్టాల బాట పడుతుందా అని ఆలోచిస్తున్నారు. అయితే నిపుణులు ఏం చెబుతున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి వారం మాదిరిగానే ఈసారి కూడా ఐపీఓల వీక్ రానే వచ్చేసింది. అయితే ఈసారి స్టాక్ మార్కెట్లోకి ఏకంగా ఏడు ఐపీఓలు (Next Week IPOs) రాబోతున్నాయి. దీంతోపాటు మరికొన్ని కంపెనీలు కూడా లిస్ట్ కానున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
మీరు నెలకు కొంత పెట్టుబడి పెట్టి భవిష్యత్‌లో కోటీశ్వరులు కావాలని చూస్తున్నారా. ఈ కలను ఎలా నిజం చేసుకోవాలని ఆలోచిస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే (Investment Tips). ఎందుకంటే ఇక్కడ చెప్పిన దాని ప్రకారం మీరు నెలకు కొంత ఇన్వెస్టే చేస్తే రూ.10 కోట్లు పొందే ఛాన్సుంది. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
అమెరికా డాలర్ ఇండెక్స్ మూడేళ్ల కనిష్టానికి పడిపోవడంతో భారత్ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ నిధులు వెల్లువెత్తవచ్చనే అంచనాల నడుమ మదుపర్లు కొనుగోళ్లుకు మొగ్గచూపారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో రోజును ముగించాయి.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన వెలువడడంతో క్రూడ్ ఆయిల్ ధరలు దిగివచ్చాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. ఈ సానుకూల సంకేతాల నడుమ ఉదయం నుంచి దేశీయ సూచీలు కూడా లాభాల్లోనే కదలాడాయి. భారీ లాభాలతో రోజును ముగించాయి
దేశీయ స్టాక్ మార్కెట్లు (Indian Stock Market) బుధవారం పాజిటివ్ ధోరణితో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ, తగ్గిన క్రూడ్ ధరలు, స్థిరమైన అమెరికా డాలర్ వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలంగా మార్చాయి.
సానుకూల సంకేతాల నడుమ ఉదయం దేశీయ సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. అయితే ఇరాన్ కాల్పుల నిబంధనలను ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ప్రకటించడం మదుపర్లలో భయాందోళనలకు కారణమైంది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఆరంభ లాభాలను కోల్పోయాయి. స్వల్ప లాభాలతో రోజును ముగించాయి
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోని అమెరికా ప్రవేశించడం అంతర్జాతీయంగా భయానక వాతావరణం సృష్టిస్తోంది. దీంతో ప్రపంచ మార్కెట్లపై నెగిటివ్ ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి.
భారత స్టాక్ మార్కెట్లు (Indian Stock Markets) సోమవారం (జూన్ 23, 2025న) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయంగా కూడా మార్కెట్లు తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి.
ఈ వారం ఇన్వెస్టర్లు మరింత అప్రమత్తతో వ్యవహరించటం మంచిది. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో అమెరికా చేరిపోవటంతో ఇరాన్ మద్దతు దేశాలు జోక్యం చేసుకునే పరిస్థితులు నెలకొనాన్నయి.