Upcoming IPOs September 1st: సెప్టెంబర్ 1 నుంచి మొదలు కానున్న IPOల లిస్ట్.. ఇన్వెస్టర్లకు మంచి ఛాన్స్
ABN , Publish Date - Aug 31 , 2025 | 03:45 PM
దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల వీక్ రానే వచ్చింది. ఈసారి కూడా భారీగా కొత్త ఐపీఓలు రాబోతున్నాయి. దీంతోపాటు మరికొన్ని కంపెనీలు లిస్టింగ్ కానున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లో ఆగస్టు నెలలో ఐపీఓల హాడావిడి ఎక్కువగానే జరిగింది. ఇదే ఉత్సాహం సెప్టెంబర్ నెలలో కూడా కనిపించబోతోంది. ఈ క్రమంలో మెయిన్‌బోర్డ్, SME సెగ్మెంట్‌లలో కలిపి మొత్తం 8 కొత్త IPOలు సెప్టెంబర్ మొదటి వారంలో రాబోతున్నాయి. అంతే కాదు, 13 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఫార్మా నుంచి IT, ఫ్యాషన్ వరకు ఈసారి అనేక కంపెనీలు మార్కెట్లోకి రాబోతున్నాయి (Upcoming IPOs September 1st 2025). ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
వచ్చే వారం సెప్టెంబర్ 1 నుంచి రానున్న ఐపీఓలు
1. అమంతా హెల్త్‌కేర్ IPO
తేదీలు: సెప్టెంబర్ 1 - సెప్టెంబర్ 3
ధర శ్రేణి: రూ.120 - రూ.126
ఇష్యూ పరిమాణం: రూ.126 కోట్లు
లాట్ సైజు: 119 షేర్లు
ఫార్మా రంగానికి చెందిన ఈ కంపెనీ IPO ద్వారా మూలధన ఖర్చులు, కార్పొరేట్ అవసరాల కోసం నిధులు సమీకరించాలనుకుంటోంది. సెప్టెంబర్ 9న లిస్టింగ్ జరిగే అవకాశం ఉంది.
2. రచిత్ ప్రింట్స్ IPO
తేదీలు: సెప్టెంబర్ 1 - సెప్టెంబర్ 3
ధర శ్రేణి: రూ.140 - రూ.149
ఇష్యూ పరిమాణం: రూ.19.49 కోట్లు
ఇది SME సెగ్మెంట్‌లో వచ్చే IPO. ప్రింటింగ్ రంగానికి చెందిన ఈ కంపెనీ 0.13 కోట్ల కొత్త షేర్లను జారీ చేయనుంది.
3. గోయల్ కన్స్ట్రక్షన్ IPO
తేదీలు: సెప్టెంబర్ 2 - సెప్టెంబర్ 4
ధర శ్రేణి: రూ. 249 - రూ. 262
ఇష్యూ పరిమాణం: రూ. 99.77 కోట్లు
కంపెనీ కొత్త షేర్లతో పాటు అమ్మకానికి షేర్లను కూడా జారీ చేయనుంది. నిర్మాణ రంగంలో ఇది కీలక కంపెనీ.
4. ఆప్టివాల్యూ టెక్ కన్సల్టింగ్ IPO
తేదీలు: సెప్టెంబర్ 2 - సెప్టెంబర్ 4
ధర శ్రేణి: రూ. 80 - రూ. 84
ఇష్యూ పరిమాణం: రూ. 51.82 కోట్లు
లాట్ సైజు: కనీసం 3,200 షేర్లు (2 లాట్లు)
ఈ IT కన్సల్టింగ్ కంపెనీ పెద్ద మోతాదులో షేర్లను SME మార్కెట్ ద్వారా జారీ చేస్తోంది.
5. ఆస్టెర్ సిస్టమ్స్ IPO
తేదీలు: సెప్టెంబర్ 3 - సెప్టెంబర్ 8
ధర శ్రేణి: రూ. 52 - రూ. 55
ఇష్యూ పరిమాణం: రూ. 15.57 కోట్లు
టెక్ రంగానికి చెందిన ఈ కంపెనీ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరిష్కారాలను అందిస్తుంది.
6. వైగర్ ప్లాస్ట్ ఇండియా IPO
తేదీలు: సెప్టెంబర్ 4 - సెప్టెంబర్ 9
ధర శ్రేణి: రూ. 77 - రూ. 81
ప్లాస్టిక్ ఉత్పత్తులు తయారు చేసే ఈ కంపెనీ మార్కెట్‌లో అడుగుపెట్టబోతోంది.
7. షార్వాయా మెటల్స్ IPO
తేదీలు: సెప్టెంబర్ 4 - సెప్టెంబర్ 9
ధర శ్రేణి: రూ.192 - రూ.196
ఇష్యూ పరిమాణం: రూ. 58.80 కోట్లు
అల్యూమినియం ఉత్పత్తుల వ్యాపారానికి చెందిన ఈ కంపెనీ మెటల్స్ రంగంలో పేరు తెచ్చుకుంది.
8. వశిష్ట్ లగ్జరీ ఫ్యాషన్ IPO
తేదీలు: సెప్టెంబర్ 5 - సెప్టెంబర్ 10
ధర శ్రేణి: రూ.109 - రూ.111
ఇష్యూ పరిమాణం: రూ. 8.87 కోట్లు
ఫ్యాషన్ & లైఫ్‌స్టైల్ రంగానికి చెందిన ఈ కంపెనీ సెప్టెంబర్ 15న లిస్టయ్యే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 1 నుంచి లిస్టింగ్ అయ్యే కంపెనీలు
సెప్టెంబర్ 1: క్లాసిక్ ఎలక్ట్రోడ్స్, శివశ్రీత్ ఫుడ్స్, ఆనందిత మెడికేర్
సెప్టెంబర్ 2: గ్లోబ్టియర్ ఇన్ఫోటెక్, NIS మేనేజ్‌మెంట్
సెప్టెంబర్ 3: ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్, అన్లాన్ హెల్త్‌కేర్, సత్వా ఇంజినీరింగ్
విక్రాంత్ ఇంజనీరింగ్ (ఈ IPO 20X ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ సాధించింది)
సెప్టెంబర్ 4: ఓవల్ ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్
సెప్టెంబర్ 5: ఏబ్రిల్ పేపర్ టెక్, సగ్స్ లాయిడ్, స్నేహ ఆర్గానిక్స్
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి