Stock Market: ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్న సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Sep 03 , 2025 | 10:36 AM
గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారం కాస్త సానుకూలంగా చలించాయి. సోమ, మంగళవారాలు భారీ లాభాలను ఆర్జించిన స్టాక్ మార్కెట్లు బుధవారం మాత్రం ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి.
గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారం కాస్త సానుకూలంగా చలిస్తున్నాయి. సోమ, మంగళవారాలు భారీ లాభాలను ఆర్జించిన స్టాక్ మార్కెట్లు బుధవారం మాత్రం ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. జీఎస్టీ నూతన సంస్కరణలపై బుధవారం, గురువారం మండలిలో చర్చించబోతున్నారు. ఈ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి (Business News).
మంగళవారం ముగింపు (80, 157)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభ నష్టాలతో దోబూచులాడుతోంది. ఒక దశలో 200 పాయింట్లకు పైగా లాభపడి మళ్లీ వెనక్కి వచ్చింది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 20 పాయింట్ల లాభంతో 80, 177 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 9 పాయింట్ల లాభంతో 24, 589 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్‌లో పిరామిల్ ఫార్మా, మనప్పురం ఫైనాన్స్, యెస్ బ్యాంక్, డెలివరీ, గ్లెన్‌మార్క్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్ టవర్స్, ఫియోనిక్స్ మిల్స్, ఎంఫసిస్, ఇన్ఫోసిస్, కోఫోర్జ్ లిమిటెడ్ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 175 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 125 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.00గా ఉంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి