Tata Capital IPO: రూ.17,200 కోట్లతో టాటా క్యాపిటల్ బిగ్ ఐపీఓ..ఎప్పుడంటే..
ABN , Publish Date - Aug 31 , 2025 | 06:49 PM
దేశీయ స్టాక్ మార్కెట్‌లో మరో భారీ ఐపీవో రాబోతుంది. ప్రముఖ కంపెనీలలో ఒకటైన టాటా గ్రూప్‌కి చెందిన టాటా క్యాపిటల్ ఇప్పుడు రూ.17,200 కోట్ల మొదటి పబ్లిక్ ఆఫర్‌తో వచ్చేస్తుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
స్టాక్ మార్కెట్‌లో (stock Market) మరో భారీ ఐపీవోకి రంగం సిద్ధమైంది. దేశంలో ప్రతిష్టాత్మకమైన కంపెనీలలో ఒకటైన టాటా గ్రూప్‌కి చెందిన టాటా క్యాపిటల్ (Tata Capital IPO) ఇప్పుడు తన తొలి పబ్లిక్ ఆఫరింగ్‌తో వచ్చేస్తుంది. ఈ నెల అంటే సెప్టెంబర్ 22 వారంలో, రూ. 17,200 కోట్ల విలువైన ఐపీవోను మార్కెట్‌కు తీసుకురానున్నట్టు తెలిసింది. మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఈ ఐపీవో ద్వారా టాటా క్యాపిటల్‌కి దాదాపు $11 బిలియన్ల (రూ. 91,000 కోట్లకు పైగా) విలువ ఏర్పడే అవకాశముంది.
ఎన్ని షేర్లు అమ్ముతున్నారు?
ఈ ఐపీవోలో మొత్తం 47.58 కోట్ల షేర్లు అమ్మకానికి వస్తున్నాయి. వీటిలో 21 కోట్ల షేర్లు కొత్తగా ఇష్యూ అవుతాయి (Fresh Issue). 26.58 కోట్ల షేర్లు ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా ప్రస్తుత షేర్‌హోల్డర్లు అమ్మనున్నారు. టాటా సన్స్ 23 కోట్ల షేర్లు విక్రయించనుంది. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (IFC) 3.58 కోట్ల షేర్లు అమ్మనుంది. ప్రస్తుతం టాటా సన్స్ టాటా క్యాపిటల్‌లో 88.6% వాటా కలిగి ఉంది, IFC దగ్గర 1.8% షేర్లున్నాయి.
ఈ డబ్బు ఎక్కడ వినియోగిస్తారు?
టాటా క్యాపిటల్ ఈ ఐపీవో ద్వారా వచ్చే నిధులను క్యాపిటల్ బేస్ పెంపునకు వినియోగించనుంది. దీని ద్వారా భవిష్యత్తులో సంస్థకు అవసరమయ్యే నిధులను సమకూర్చడం, రుణాల ఇవ్వడం వంటివి సులభతరం అవుతాయి.
RBI నిబంధనల కారణంగానే
ఇండియాలోని ఉన్నత స్థాయి NBFCs (Upper-layer NBFCs)గా RBI గుర్తించిన సంస్థలు మూడు సంవత్సరాలలోపుగా లిస్టింగ్ కావాలి. టాటా క్యాపిటల్‌కు 2022 సెప్టెంబర్‌లో అలాంటి గుర్తింపు వచ్చింది. ఆ విధంగా, ఇది అత్యవసర లిస్టింగ్ అవుతోంది. ఈ ఐపీవో టాటా గ్రూప్ తరఫున ఇటీవలి కాలంలో మార్కెట్‌కి వస్తున్న రెండో లిస్టింగ్. గత ఏడాది నవంబర్ 2023లో టాటా టెక్నాలజీస్ ఐపీవో వచ్చి మంచి రెస్పాన్స్ పొందింది.
బడా NBFCల ట్రెండ్‌లో టాటా క్యాపిటల్
ఇటీవలి కాలంలో NBFC రంగంలో భారీ ఐపీవోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. జూన్‌లో HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ. 12,500 కోట్ల ఐపీవోతో మార్కెట్‌లోకి వచ్చింది. అలాగే, సెప్టెంబర్ 2024లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా భారీ లిస్టింగ్‌కి వెళ్లింది. మొదటి రోజు 135% ప్రీమియంతో ముగిసింది.
మార్చి 2025 నాటికి సంస్థ ఇచ్చిన మొత్తం రుణాలు రూ.2.26 లక్షల కోట్లకు చేరాయి. ఇది FY23 నుంచి FY25 వరకు 37% CAGR పెరుగుదల చూపిస్తోంది.
FY25లో సంస్థ లాభం రూ.3,646.6 కోట్లు. ఇది FY23లో రూ.3,029.2 కోట్లతో పోలిస్తే 10% CAGR పెరిగింది.
సంస్థ దివాళా రేటు తక్కువగానే ఉంది. గ్రాస్ బ్యాడ్ లోన్స్ 1.9%, నెట్ బ్యాడ్ లోన్స్ 0.8% ఉన్నాయి.
టాటా క్యాపిటల్ వ్యాపారం
టాటా క్యాపిటల్ కేవలం రుణాలు ఇవ్వడంలోనే కాదు బీమా, క్రెడిట్ కార్డ్ లాంటి థర్డ్ పార్టీ సేవలను కూడా అందిస్తుంది. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లకి స్పాన్సర్‌గా, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్‌గా కూడా వ్యవహరిస్తుంది. 2007లో వ్యాపారం ప్రారంభించిన టాటా క్యాపిటల్, ఇప్పటివరకు 70 లక్షల మందికి పైగా కస్టమర్లకు సేవలందించింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి