Share News

Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ABN , Publish Date - Sep 01 , 2025 | 09:57 AM

గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని సానుకూలంగా ప్రారంభించాయి. గత వారం వరుస నష్టాలతో 80 వేల దిగువకు పడిపోయిన సెన్సెక్స్ ఈ రోజు మళ్లీ కోలుకుంది. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్ మళ్లీ 80 వేల మార్క్‌ను దాటింది.

Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
Stock Market

గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని సానుకూలంగా ప్రారంభించాయి. గత వారం వరుస నష్టాలతో 80 వేల దిగువకు పడిపోయిన సెన్సెక్స్ ఈ రోజు మళ్లీ కోలుకుంది. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్ మళ్లీ 80 వేల మార్క్‌ను దాటింది. చైనాతో భారత్ స్నేహం చిగురిస్తుందనే అంచనాలతో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల బాటలో ఉన్నాయి (Business News).


గత శుక్రవారం ముగింపు (79, 809)తో పోల్చుకుంటే సోమవారంవారం ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగబాకింది. పలు రంగాలు లాభాల్లో సాగుతున్నాయి. ప్రస్తుతం ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 391 పాయింట్ల లాభంతో 80, 201 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 124 పాయింట్ల లాభంతో 24, 551 వద్ద కొనసాగుతోంది.


సెన్సెక్స్‌లో బీఎస్‌ఈ లిమిటెడ్, హిందుస్థాన్ జింక్, సీజీ పవర్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, కేన్స్ టెక్నాలజీస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. మారుతీ సుజుకీ, ఎస్బీఐ కార్డ్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ లాంబార్డ్, రిలయన్స్ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 749 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 312 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.23గా ఉంది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 01 , 2025 | 09:57 AM