Home » Sports
భారత పురుషుల జట్టు 2025 ఆసియా కప్, భారత మహిళల జట్టు 2026 ఆసియా కప్ టైటిళ్లు గెలిచినప్పటికీ.. పాకిస్థాన్‌కు చెందిన మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి నిరాకరించాయి.
జపాన్‌లో 20వ ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. 501 మంది అథ్లెట్లతో బరిలోకి దిగిన భారత్ గతంలో సాధించిన 107 పతకాల రికార్డును అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. షూటింగ్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, హాకీ, బాక్సింగ్, ఆర్చరీ, కబడ్డీలో భారత్ పతకాలపై భారీ ఆశలు పెట్టుకుంది.
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీ మార్పుపై మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పించి.. స్టార్ బ్యాటర్ స్మృతి మంధానకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ఆమె అభిప్రాయపడ్డారు.
భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వడం గొప్ప అనుభవమని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) డైరెక్టర్ శ్యామ్ సుందర్ అన్నారు.
అఫ్గానిస్థాన్ సిరీస్‌లో 15 ఏళ్ల వైభవ్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. అతడు తన అవకాశాల కోసం ఇంకాస్త సమయం వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశాడు.
ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. జపాన్ వేదికగా ఆతిథ్య జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది.
జపాన్‌లోని ఐచీ నగోయాలో జరగనున్న 2026 ఆసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత పతాకాన్ని మను భాకర్, తజీందర్‌పాల్ సింగ్ తూర్ మోయనున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మనూ, రెండు ఆసియా క్రీడల్లో వరుసగా షాట్‌పుట్ స్వర్ణాలు గెలిచిన తూర్‌కు ఈ గౌరవం దక్కింది.
ఆసియా క్రీడల కోసం జపాన్‌లోని నాగోయాకు చేరుకున్న భారత బృందానికి ఆరంభంలోనే అడుగడుగునా అవస్థలు ఎదురవుతున్నాయి. భారత జిమ్నాస్ట్ ప్రణతి నాయక్, ఆమె కోచ్ అశోక్ మిశ్రాకి కూడా షాకింగ్ అనుభవం ఎదురైంది. క్రూయిజ్ షిప్‌లో వారిద్దరికీ ఒకే గదిని కేటాయించడంతో గందరగోళం నెలకొంది.
అఫ్ఘానిస్థాన్‌పై మూడో టీ20లో అభిషేక్ శర్మ 30 బంతుల్లో శతకం బాది 108 పరుగులు చేశాడు. భారత్ 127 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
ఆంధ్ర బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి అంకమ్మ చౌదరికి ఆసియా క్రీడల్లో కీలక బాధ్యత దక్కింది. ఆమె భారత బ్యాడ్మింటన్ జట్టు అధికారిక ప్రతినిధిగా వ్యవహరించనున్నారు.