Home » Siddipet
ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఆట వస్తువును మింగడంతో ఊపిరాడక 14 నెలల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో ఆదివారం జరిగింది.
ఓ జవాన్ దేశం కోసం సరిహద్దుల్లో పోరాడుతుంటే.. ఆయన సొంత జిల్లాలో మాత్రం జవాన్‌కు అన్యాయం జరుగుతోంది. జవాన్‌కు చెందిన భూమిని కబ్జా చేశారు కొందరు వ్యక్తులు.
డిప్లొమా విద్యార్థులు ఇంజనీరింగ్ (బీటెక్) ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఏపీ ఈసెట్-2025లో సిద్దిపేట జిల్లాకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి మొదటి, రెండో ర్యాంకులను దక్కించుకున్నారు.
ఉపాధి పనుల కోసం వెళ్తున్న ఇద్దరు కూలీలను కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మరో కూలీకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండలంలో జరిగింది.
BRS leader Harish Rao: సిద్ధిపేట మార్కెట్ యార్డ్‌లో వంద లారీలు ధాన్యం తడిసిపోయి ఉందని, వడ్ల కుప్పల మీదనే రైతులు ప్రాణాలు వదులుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇప్పటికే ఐదుగురు రైతులు ధాన్యపు కుప్పల మీదనే ప్రాణాలు వదిలారని.. ఇవి సాధారణ మరణాలు కావని, ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆరోపించారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రంగనాయకసాగర్ జలాశయాన్ని చూడడానికి కుటుంబ సభ్యులతో వచ్చిన ఇద్దరు బాలలు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందారు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ నుంచి వస్తున్న ఓ జీపు(తుఫాన్) ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
లంకలో రావణుడి అరాచకాలను అరికట్టడానికి ఆనాడు రామదండు కదిలిందని.. నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న అరాచకాన్ని అడ్డుకునేందుకు గులాబీ దండు కదిలిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.
HarishRao: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి సంక్షేమాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ఉద్ఘాటించారు. ఏడాదిన్నరగా ప్రతిపక్ష పాత్రలో ప్రజలతోనే ఉన్నామని హరీష్‌రావు చెప్పారు.
Minister Ponnam Prabhakar: భూ భారతి చట్టంతో రైతులకు న్యాయం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భూమి రక్షణ కోసం ఈ చట్టాన్ని తీసుకువచ్చామని అన్నారు. త్వరలోనే గౌరవెల్లి కాల్వల నిర్మాణం పూర్తవుతుందని.. ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.