Home » Seethakka
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 23న మేడారం పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్శనకు సంబంధించి అధికారులు భారీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇప్పించి, వడ్డీ ప్రభుత్వం కడుతోందని మంత్రి సీతక్క వెల్లడించారు. 95 శాతం మహిళలు సక్రమంగా తీసుకున్న ఋణాలు చెల్లిస్తున్నారని తెలిపారు.
మేడారం జాతరపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సీతక్క కౌంటర్ ఇచ్చారు. కొందరు స్వార్థం కోసం మేడారంపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి మేడారం అభివృద్ధికి ముందు నుంచే ప్రణాళికలు చేస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. గద్దెల మార్పుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.. భారీ వర్షాలకు కామారెడ్డిలో చాలా నష్టం వాటిల్లిందని తెలిపారు. వరద పరిశీలనకు వస్తున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ గురించి మాట్లాడినట్లు గుర్తు చేశారు.
కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పకడ్బందీగా అమలు చేయాలి ఆదేశించారు. రాబోయే 15 రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలైన మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతల జాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటాలని, ఈ మేరకు మహాజాతరను నిర్వహించనున్నట్లు మంత్రులు మంత్రి కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
కవిత ఎపిసోడ్ కుటుంబ రాజకీయ డ్రామా అంటూ మంత్రి సీతక్క కొట్టిపారేశారు. తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కేసీఆర్.. నలుగురు కుటుంబ సభ్యులను కూర్చోపెట్టి మాట్లాడి సర్దుబాటు చేయలేని బలహీన పరిస్థితికి చేరుకున్నారా అని ప్రశ్నించారు.
తెలంగాణ ట్రైబల్ డిజైన్ ప్లాన్లతో మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులకు రూపకల్పన చేసినట్లు మంత్రి దనసరి సీతక్క తెలిపారు.
భారీ వర్షాలు, వరదలు వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు దామోదరరాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, ధనసరి అనసూయ(సీతక్క) పేర్కొన్నారు.