Minister Seethakka Medaram News: రాబోయే రోజుల్లో మేడారం మరింత అభివృద్ధి..
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:41 AM
మేడారం మూలాలను కాపాడుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు. ఆదివాసీల మనోభావాలకు తగినట్టుగా గద్దెల మార్పులు చేస్తున్నామని చెప్పారు. పూజారులతో మరోసారి సీఎం చర్చించి డిజైన్‌లు ఫైనల్ చేస్తారని వెల్లడించారు.
ములుగు, సెప్టెంబర్ 23: మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటనకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి సీతక్క దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తున్నారు. మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి వనదేవతలను మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు విమర్శలకే పరిమితం, వారి హయాంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. మేడారం మూలాలను కాపాడుకుంటామని తెలిపారు. ఆదివాసీల మనోభావాలకు తగినట్టుగా గద్దెల మార్పులు చేస్తున్నామని చెప్పారు. పూజారులతో మరోసారి సీఎం చర్చించి డిజైన్‌లు ఫైనల్ చేస్తారని వెల్లడించారు.
బయటి వ్యక్తులు, రాజకీయ నాయకుల అభిప్రాయాలు కాకుండా ఆదివాసి పూజారుల సమ్మతితో అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. సీఎం సహా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ రాబోతున్నారన్నారు. సీఎం ప్రత్యేకంగా మేడారం వరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని.. అడగకుండానే ఆయన అన్నీ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు.
మేడారంకు బయలుదేరిన సీఎం..
మరోవైపు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి మేడారం బయలుదేరి వెళ్లారు. సీఎం వెంట మంత్రి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను ముఖ్యమంత్రి దర్శించుకోనున్నారు. స్థానిక పూజారులు, పెద్దలతో ఆలయ అభివృద్ధి పనులపై రేవంత్ సమీక్షించనున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొననున్నారు సీఎం. ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ విడుదల చేయనున్నారు.
ఇవి కూడా చదవండి...
రెండో రోజు దుర్గమ్మ ఏ అలంకారంలో దర్శనమిస్తున్నారంటే
దానిపై వాయిదా తీర్మానం విడ్డూరం.. వైసీపీపై లోకేష్ మండిపాటు
Read Latest Telangana News And Telugu News