Seethakka On Medaram: మేడారంలో సీతక్క పర్యటన.. ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్...
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:19 PM
మేడారం జాతరపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సీతక్క కౌంటర్ ఇచ్చారు. కొందరు స్వార్థం కోసం మేడారంపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ములుగు: మేడారం మహాజాతర నేపథ్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ మేరకు ఆమె మేడారంలో పర్యటించారు. స్థానిక ఎస్పీ శబరీష్‌తో బైక్‌పై తిరుగుతూ పనులను పర్యవేక్షించారు. అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మేడారం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వచ్చే ఏడాది జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నామని సీతక్క ధీమా వ్యక్తం చేశారు.
మేడారం జాతరపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సీతక్క కౌంటర్ ఇచ్చారు. కొందరు స్వార్థం కోసం మేడారంపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గద్దెలు మారుస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుది డీపీఆర్ ఇంకా సిద్ధం కాలేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే తుది డిజైన్లు ఫైనల్ అవుతాయని వివరించారు.
ఈ మహా మేడారం జాతరకు రూ.150 కోట్లు ప్రజా ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. అవసరమైతే ఇతర శాఖల సహాయంతో మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పుకొచ్చారు. మేడారంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను వంద రోజుల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని మంత్రి సీతక్క గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి..
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
243 సీట్లలో పోటీ చేస్తాం..బీహార్‌లో గేమ్ ఛేంజర్ ప్లాన్..