Telangana Anganwadi Dasara Holidays: అంగన్వాడి కేంద్రాలకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
ABN , Publish Date - Sep 25 , 2025 | 08:33 PM
అంగన్వాడిల చరిత్రలో మొట్టమొదటిసారిగా అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఎనిమిది రోజుల పాటు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు తొలిసారిగా దసరా సెలవులు ప్రకటించింది. రేపటి నుండి మొత్తం ఎనిమిది రోజుల పాటు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 27 నుంచి వచ్చే నెల నాలుగు వరకు అంగన్వాడీలకు దసరా సెలవులు ప్రకటించింది.
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల విజ్ఞప్తి మేరకు దసరా సెలవులు మంజూరు చేయాలని అధికారులకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. టేక్ హోమ్ రేషన్ విధానంలో లబ్ధిదారులకు పోషకాహారాన్ని అందజేయాలని సూచించారు. అంగన్వాడిల చరిత్రలో మొట్టమొదటిసారిగా అంగన్వాడీలకు దసరా సెలవులు ప్రకటించారు.
ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే దసరా, బతుకమ్మ పండగలు జరుపుకునే విధంగా దసరా సెలవులు మంజూరు చేయాలని మంత్రి సీతక్కను, ఐఎన్టీయూసీ అనుబంధ తెలంగాణ స్టేట్ ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బి అన్నపూర్ణ, ఇతర ప్రతినిధులు ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. వారి కోరిక మేరకు 8 రోజుల పాటు అంగన్వాడీలకు సెలవులు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తమకు సెలవులు మంజూరు చేసిన ప్రభుత్వానికి, మంత్రి సీతక్కకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read:
నిరుద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్.. ఇకపై ప్రతిఏటా నోటిఫికేషన్..
HALతో రూ. 62 వేల కోట్ల ఒప్పందం
For More Latest News