Home » Rohit Sharma
నేటి నుంచి న్యూజిలాండ్-భారత జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొద్ది రోజులుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. సూర్యకు ఓ కీలక సూచన చేశాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ భద్రతలో సిబ్బంది వైఫల్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్ సందర్భంగా హోటల్ లోపలకు వెళ్తున్న రోహిత్ శర్మ వద్దకు ఓ మహిళ ఒక్కసారిగా దూసుకొచ్చింది. తన కుమార్తె ఆరోగ్యం బాలేదని సాయం చేయాలంటూ అభ్యర్థించింది.
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒకే ఫార్మాట్ ఆడుతున్న కారణంగా వారిని ఏ ప్లస్ కేటగిరీ నుంచి ‘బీ గ్రేడ్’కు డిమోట్ చేసే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాల సమాచారం..
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత రో-కో మళ్లీ మైదానంలో కనిపించేది ఎప్పుడంటే..
టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో పెద్దగా రాణించలేదు. అయితే.. మ్యాచ్ అనంతరం రోహిత్ ఫామ్‌పై ఎదురైన ప్రశ్నకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రోహిత్ భారీ స్కోర్లు చేయలేకపోయినా మంచి ఫామ్‌లోనే ఉన్నాడని చెప్పాడు.
టీమిండియా హిట్టర్ రోహిత్ శర్మ మరో మైలురాయిని తాకాడు. న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో ఈ ఫీట్ ను సాధించాడు. ఆసియాలోనే 7000 వన్డే పరుగులు చేసిన వారి జాబితాలో రోహిత్ శర్మ తన పేరును లిఖించుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ...
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత తొలిసారి వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచాడు. చివరిసారిగా 2021లో విరాట్ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో టాప్-1గా నిలిచాడు.
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో సరైన సత్సంబంధాలు లేవంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించారు.
అచ్చం చిన్ననాటి కోహ్లీలా ఉన్న ఓ బాలుడు విరాట్‌ను కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ అబ్బాయి తనతో విరాట్ ఏం మాట్లాడాడో.. సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. రో-కో ఇద్దరూ తనను చోటా చీకూ అని పిలిచారని తెలిపాడు.
టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఓ కార్యక్రమంలో ఐసీసీ ఛైర్మన్ జై షా రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ను కెప్టెన్ అనే పిలుస్తానని తెలిపాడు.