Rohit Sharma records: ఆస్ట్రేలియాతో తొలి వన్డే మ్యాచ్.. రోహిత్ కోసం వెయిట్ చేస్తున్న రికార్డులు..
ABN , Publish Date - Oct 19 , 2025 | 08:25 AM
దాదాపు ఏడు నెలల విరామం తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్నాడు. ఇప్పటికే టీ-20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ టీమిండియా తరఫున వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో బరిలోకి దిగబోతున్నాడు.
దాదాపు ఏడు నెలల విరామం తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్నాడు. ఇప్పటికే టీ-20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ టీమిండియా తరఫున వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో బరిలోకి దిగబోతున్నాడు. తాజా సిరీస్‌లో బ్యాటర్‌గానే బరిలోకి దిగుతున్న రోహిత్ పలు రికార్డులు బద్దలుకొట్టబోతున్నాడు (Rohit Sharma record Australia).
రోహిత్ మరో పది పరుగులు చేస్తే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డే రోహిత్ కెరీర్‌లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ అవుతుంది. రోహిత్ కంటే ముందు సచిన్ (664), కోహ్లీ (550), ధోనీ (535), రాహుల్ ద్రవిడ్ (504) మాత్రమే టీమిండియా తరఫున 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. రోహిత్ ఇప్పటివరకు తన అంతర్జాతీయ కెరీర్‌లో 49 సెంచరీలు చేశాడు. మరో సెంచరీ చేస్తే 50 శతకాలు పూర్తి చేసుకుంటాడు (Rohit Sharma records 2025).
వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పడానికి రోహిత్ శర్మ కేవలం ఎనిమిది సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం షాహిద్ అఫ్రిది 351 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. వన్డేల్లో 344 సిక్సర్లతో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు (Rohit Sharma sixes record).
ఇక, రోహిత్ మరో 196 పరుగులు చేస్తే వన్డేల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (18426) అగ్రస్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ (14181), సౌరవ్ గంగూలీ (11221) రోహిత్ కంటే ముందున్నారు (India vs Australia ODI series).
తాజా పర్యటనలో రోహిత్ మరో సెంచరీ చేస్తే ఆస్ట్రేలియాపై 10 సెంచరీలు చేసిన తొలి భారత ఓపెనర్‌గా నిలుస్తాడు (Rohit Sharma centuries vs Australia). సచిన్ టెండూల్కర్ (8), విరాట్ కోహ్లీ (8) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. అలాగే రోహిత్ మరో 174 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా అగ్రస్థానంలో నిలుస్తాడు.
ఇవి కూడా చదవండి..
పోక్సో కేసుల పరంపర.. తల్లిదండ్రుల ఆందోళన
పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్యకు కేటీఆర్ అండ