Rohit sharma six: రోహిత్ భారీ సిక్స్.. తన సొంత లంబోర్గిని కారు అద్దాలు బ్రేక్..
ABN , Publish Date - Oct 11 , 2025 | 09:12 AM
టీమిండియా మాజీ కెప్టెన్, డాషింగ్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మాజీ సహచరుడు అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలో ముంబైలోని శివాజీ స్టేడియంలో శుక్రవారం రెండు గంటల పాటు సాధన చేశాడు.
టీమిండియా మాజీ కెప్టెన్, డాషింగ్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మాజీ సహచరుడు అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలో ముంబైలోని శివాజీ స్టేడియంలో శుక్రవారం రెండు గంటల పాటు సాధన చేశాడు. భారీ షాట్లు కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రోహిత్ కొట్టిన ఓ భారీ సిక్స్ తన లంబోర్గిని కారు అద్దాలను బద్దలు చేసింది (rohit sharma big six).
రోహిత్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు (Rohit Smashes His Own Car). ఆస్ట్రేలియాతో ఈ నెల 19వ తేదీ నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కాబోతోంది. తొలి వన్డే పెర్త్‌లో జరగబోతోంది. శుభ్‌మన్ గిల్ టీమిండియా వన్డే కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్‌తో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. రోహిత్‌ను టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా తరఫున రోహిత్ ఆడడం ఇదే మొదటిసారి.
ఆస్ట్రేలియా వన్డే టోర్నీలో ఫామ్ పైనే రోహిత్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. 2027 ప్రపంచకప్ వరకు కొనసాగాలని రోహిత్, అతడి అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ దాదాపు 20 కిలోల బరువు తగ్గి ఫిట్‌గా మారిపోయాడు. కాగా, శుక్రవారం శివాజీ పార్క్‌లో రోహిత్ శర్మ ప్రాక్టీస్‌ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు.
ఇవి కూడా చదవండి:
Shubman Gill: శుభ్‌మన్ గిల్‌కు బిగ్ రిలీఫ్.. తొలిసారి !
IPL 2026: CSK రిలీజ్ చేయనున్న ప్లేయర్లు వీరే!
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి