IPL 2026: CSK రిలీజ్ చేయనున్న ప్లేయర్లు వీరే!
ABN , Publish Date - Oct 10 , 2025 | 04:47 PM
ఐపీఎల్ 2026 వేలం ముంబైలో జరగనున్నట్లు సమాచారం. అయితే దీని గురించి ఐపీఎల్ నిర్వాహకులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. డిసెంబర్ 13 నుంచి 15 వరకు ఐపీఎల్ 2026 వేలం జరగనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈసారి చెన్నై సూపర్ కింగ్ పలువురు ఆటగాళ్లను వదులుకోనుంది.
ఐపీఎల్ 2026 కు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈసారి చెన్నై సూపర్ కింగ్ పలువురు ఆటగాళ్లను వదులుకోనున్నట్లు తెలుస్తుంది. క్రిక్ బజ్(cricbuzz) తెలిపిన వివరాల ప్రకారం.. దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, సామ్ కరన్ కాన్వేలను వదులుకునే అవకాశం ఉంది. ఇప్పటికే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్ కావడంతో చెన్నై అకౌంట్ లో రూ.9.75 కోట్లు యాడ్ అయ్యాయి. అయితే ఈ ఆటగాళ్లను వదులుకునే విషయంపై సీఎ(CSK Player List 2026)స్కే నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్(RR Released Players) నుంచి ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్, శ్రీలంక స్పిన్నర్లు హసరంగ, మహీశ్ తీక్షణలు బయటకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో మిగత SRH, RCB వంటి మిగిలిన జట్లలో ఎలాంటి మార్పులు ఉంటాయో అని క్రికెట్ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.
ఇక ఐపీఎల్ 2026(IPL 2026) విషయానికి వస్తే.. ఈసారి వేలం ముంబైలో జరగనున్నట్లు సమాచారం. అయితే దీని గురించి ఐపీఎల్ నిర్వాహకులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. డిసెంబర్ 13 నుంచి 15 వరకు ఐపీఎల్ 2026 వేలం జరగనున్నట్లు తెలుస్తుంది. బీసీసీఐతో చర్చించిన ఫ్రాంచైజీల ప్రతినిధులు ఈ తేదీలను సూచించారని తెలుస్తుంది. ఈ విషయంపై ఐపీఎల్ కమిటీదే తుది నిర్ణయంగా ఉంటుంది.
ఇదే సమయంలో ప్రాంఛైజీలు తమ వద్ద ఉంచుకునే రిటెన్షన్ లిస్టును, వదులుకునే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సీఎస్కే(CSK), రాజస్థాన్(RR)పైన పేర్కొన్న ఆటగాళ్లను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలానే గత సీజన్ వేలంలో ఎవరూ ఊహించని రీతిలో రూ. 23.75 కోట్ల ధర దక్కించుకున్న వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్ వదిలించుకోవచ్చని టాక్ వినిపిస్తోంది. మరి..ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.